Kuberaa Day 15 Collections: భారీగా పడిపోయిన కుబేర కలెక్షన్స్.. ధనుష్ మూవీకి 15వ రోజు ఎన్ని కోట్లంటే?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న నటించిన క్రైమ్ అండ్ పొలిటికల్ డ్రామా కుబేర. జిబ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, దివ్య డెకాటే, కౌశిక్ మహతా, హరీష్ పెరాడీ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్‌రావు, శేఖర్ కమ్ముల సంయుక్తంగా కుబేర చిత్రాన్ని నిర్మించారు. నికెత్ బొమ్మిరెడ్డి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా.. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందజేశారు. కుబేర చిత్రం జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది.

కుబేర బడ్జెట్ ఎంత?
ముంబై, హైదరాబాద్ తదితర నగరాల్లో అత్యంత సహజమైన లోకేషన్‌లలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది. పర్పెక్షన్‌కు ప్రాణం ఇచ్చే ధనుష్ డంపింగ్ యార్డ్‌ సీన్ కోసం ఎంతో కష్టపడ్డారు. హై టెక్నికల్ వాల్యూస్‌తో ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాను నిర్మించారు నిర్మాతలు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి కుబేర సినిమాకు రూ.145 కోట్ల వ్యయం అయినట్లు ఫిలింనగర్ వర్గాలు తెలిపాయి.

Kuberaa Day 15 Box Office Collections Worldwide Dhanush s Film 3 Crores Away for Breakeven

కుబేర బిజినెస్ & బ్రేక్ఈవెన్ టార్గెట్
నాగార్జున, ధనుష్‌లు తొలిసారి కలిసి నటిస్తుండగా వీరికి నేషనల్ క్రష్ రష్మిక మందన్న జత కలవడం పైగా శేఖర్ కమ్ముల బ్రాండ్ ఇమేజ్‌తో కుబేర చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. ఆంధ్రా, నైజాంలలో రూ.33 కోట్లు, తమిళనాడులో రూ.18 కోట్లు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా కలిపి రూ.5.5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.8.5 కోట్ల చొప్పున వరల్డ్ వైడ్‌గా రూ.65 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కుబేర. ధనుష్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.66 కోట్ల షేర్.. రూ.132 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు.

తెలుగు రాష్ట్రాల్లో కుబేర వసూళ్ల విషయానికి వస్తే.. 14 రోజుల వరకు నైజాంలో 16.75 కోట్ల రూపాయలు , సీడెడ్‌లో 4.75 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 6 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 2.75 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరిలో 1.64 కోట్ల రూపాయలు, గుంటూరులో 2.29 కోట్ల రూపాయలు, కృష్ణాలో 2.28 కోట్ల రూపాయలు, నెల్లూరులో 1.22 కోట్ల రూపాయల చొప్పున ఆంధ్రా, నైజాంలలో కుబేరకు నికరంగా 37.69 కోట్ల రూపాయల నెట్.. 63.85 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో కుబేరా సినిమా లాభాల్లోకి రావాలంటే 34 కోట్ల రూపాయల గ్రాస్ రావాల్సి ఉండగా.. ఆ టార్గెట్‌ను కొట్టేసి ప్రాఫిట్ జోన్‌లోకి వచ్చేసింది.

ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో కుబేర వసూళ్ల విషయానికి వస్తే.. 14 రోజుల వరకు తమిళనాడులో 19.65 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 11.30 కోట్ల రూపాయలు, కేరళలో 1.25 కోట్ల రూపాయలు, హిందీ + రెస్టాఫ్ ఇండియాలో 2.80 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా 14 రోజుల వరకు ఇండియాలో కుబేరాకు 85 కోట్ల రూపాయల నెట్, 98 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైంది. ఓవర్సీస్‌లో శేఖర్ కమ్ములకు బ్రాండ్ ఇమేజ్ ఉండటంతో అక్కడి నుంచి కుబేరకు మేజర్ షేర్ వచ్చింది. ఓవర్సీస్ మార్కెట్‌లో ధనుష్ మూవీకి ఇప్పటి వరకు 30.5 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి.

15వ రోజు కుబేర వసూళ్లు ఎంత?
ధనుష్ మూవీకి 15వ రోజు బుకింగ్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. తెలుగు వెర్షన్‌లో 16.40 శాతం, తమిళంలో 15.81 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. 15వ రోజు తెలుగులో 61 లక్షల రూపాయలు, తమిళంలో 2 లక్షల రూపాయలు, హిందీలో 2 లక్షల రూపాయల చొప్పున ఇండియా వైడ్‌గా 65 లక్షల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. 15 రోజుల వరకు కుబేర చిత్రానికి ఇండియా వైడ్ 85.28 కోట్ల రూపాయల నెట్, 99.3 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు సాక్‌నిల్క్ తెలిపింది. దీనికి ఓవర్సీస్ కలెక్షన్స్ కలుపుకుని 15 రోజుల వరకు ప్రపంచవ్యాప్తంగా కుబేర మూవీ 129.8 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు సాక్‌నిల్క్ వెల్లడించింది. ఈ చిత్రం ఓవరాల్‌గా బ్రేక్ఈవెన్ కావాలంటే మరో 3 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు తెలిపారు.

More from Filmibeat

Read more about: Kuberaa dhanush box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X