Kuberaa Day 3 Collections: 100 కోట్లకు చేరువగా కుబేర..ధనుష్ మూవీకి ఎన్ని కోట్లంటే?
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం కుబేరా. సోషల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్వకత్వం వహించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో హిందీ నటులు జిబ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, దివ్య డెకాటే, కౌశిక్ మహతా, హరీష్ పెరాడీ తదితరులు నటించారు.
ఈ సినిమాకు నికెత్ బొమ్మిరెడ్డి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కుబేరా సినిమాకు స్టార్ వాల్యూ, టాప్ టెక్నిషియన్స్ స్పెషల్ ఎట్రాక్షన్. ఈ మూవీలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక విభాగాల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులు కలిపి ఈ సినిమాను సుమారుగా 125 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా ప్రొమోలు, ప్రమోషన్స్‌తో ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది.
కుబేరాలోని స్టార్ వాల్యూతో ఈ సినిమా బిజినెస్ భారీగానే జరిగింది. తెలుగు రాష్ట్రాల బిజినెస్ 33 కోట్లు, తమిళనాడులో 18 కోట్ల రూపాయలు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల బిజినెస్ సుమారుగా 5.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 8.5 కోట్ల రూపాయలు మేర బిజినెస్ జరిగింది. ఈ మూవీ సినిమా బిజినెస్ ఓవరాల్‌గా 65 కోట్ల రూపాయలు మేర జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఈ చిత్రం 130 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలు పెట్టింది.
ధనుష్, రష్మిక, నాగార్జున నటించిన ఈ చిత్రం తొలి రోజు గ్రాండ్‌గా జర్నీ మొదలుపెట్టింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్ల రూపాయలు, తమిళనాడులో 5 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 1.5 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1.5 కోట్లు, ఓవర్సీస్‌లో 11 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొదటి రోజు ఈ సినిమా 31 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 7.25 కోట్ల నెట్, 12.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, ఓవర్సీస్ 4 కోట్లు రూపాయలు, కర్ణాటకలో 2.30 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 1.5 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్లు 21 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక ఈ సినిమా 3వ రోజు బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపించింది. ఈ సినిమా మూడో రోజు 60 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమా ఇండియాలో 17.5 కోట్ల నెట్, వరల్డ్ వైడ్‌గా 25 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేస్తుందని సాక్ నిల్క్ అంచనా వేసింది. ఈ సినిమా గత మూడు రోజుల్లో 77 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











