Kuberaa Day 4 Collections: కుబేరాకు మండే అగ్ని పరీక్ష.. ధనుష్ మూవీకి ఎన్ని కోట్లంటే?
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం కుబేరా. సోషల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్వకత్వం వహించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో హిందీ నటులు జిబ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, దివ్య డెకాటే, కౌశిక్ మహతా, హరీష్ పెరాడీ తదితరులు నటించారు.
ఈ సినిమాకు నికెత్ బొమ్మిరెడ్డి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కుబేరా మూవీలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక విభాగాల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులు కలిపి ఈ సినిమాను సుమారుగా 125 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా ప్రొమోలు, ప్రమోషన్స్‌తో ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. కుబేరాలోని స్టార్ వాల్యూతో ఈ సినిమా బిజినెస్ భారీగానే జరిగింది. తెలుగు రాష్ట్రాల బిజినెస్ 33 కోట్లు, తమిళనాడులో 18 కోట్ల రూపాయలు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల బిజినెస్ సుమారుగా 5.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 8.5 కోట్ల రూపాయలు మేర బిజినెస్ జరిగింది. ఈ మూవీ సినిమా బిజినెస్ ఓవరాల్‌గా 65 కోట్ల రూపాయలు మేర జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఈ చిత్రం 130 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలు పెట్టింది.
గత మూడు రోజుల్లో కుబేరా బాక్సాఫీస్ వద్ద సాధించిన కలెక్షనల్ వివరాల్లోకి వెళితే.. ఆంధ్రా, నైజాంలో ఈ సినిమా 37.5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 13.5 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 6.5 కోట్ల రూపాయలు, కేరళలో 1 కోటి రూపాయలు, మిగితా రాష్ట్రాల్లో ఈ సినిమా 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో కూడా భారీగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం ఇప్పటి వరకు 2.6 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 22 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఆంధ్రా, తెలంగాణలో కుబేర చిత్రం వసూళ్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 9 కోట్లకుపైగా, సీడెడ్‌లో 3 కోట్లకుపైగా, ఆంధ్రాలో 10 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. దాంతో ఈ సినిమా 22 కోట్ల నెట్, 37.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 33 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది.
ఇక కుబేరా చిత్రం 4వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 3.5 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.5 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 50 లక్షల రూపాయలు, ఇండియాలో మొత్తంగా 6.5 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఓవర్సీస్‌లో ఓ కోటి రూపాయలు వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. దాంతో ఈ సినిమా 90 కోట్ల రూపాయలు మొత్తంగా వసూలు చేస్తుందని ట్రేడ్ అంచనా.


Click it and Unblock the Notifications











