Kuberaa Day 5 Collections: రష్మిక మందన్న ఖాతాలో మరో సంచలనం.. కుబేరా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం కుబేరా. సోషల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్వకత్వం వహించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో హిందీ నటులు జిబ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, దివ్య డెకాటే, కౌశిక్ మహతా, హరీష్ పెరాడీ తదితరులు నటించారు. ఈ సినిమాకు నికెత్ బొమ్మిరెడ్డి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, 5 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
కుబేరా మూవీలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక విభాగాల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులు కలిపి ఈ సినిమాను సుమారుగా 125 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా ప్రొమోలు, ప్రమోషన్స్‌తో ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. కుబేరాలోని స్టార్ వాల్యూతో ఈ సినిమా బిజినెస్ భారీగానే జరిగింది. తెలుగు రాష్ట్రాల బిజినెస్ 33 కోట్లు, తమిళనాడులో 18 కోట్ల రూపాయలు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల బిజినెస్ సుమారుగా 5.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 8.5 కోట్ల రూపాయలు మేర బిజినెస్ జరిగింది. ఈ మూవీ సినిమా బిజినెస్ ఓవరాల్‌గా 65 కోట్ల రూపాయలు మేర జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఈ చిత్రం 130 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలు పెట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కుబేరా సినిమా తొలి రోజు ఏపీ, తెలంగాణలో కలిపి 6.75 కోట్లు, రెండో రోజు 7.25 కోట్లు, మూడో రోజు 8 కోట్ల రూపాయలు, 4వ రోజు 3.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా గత 4 రోజుల్లో 25.25 కోట్ల రూపాయల నెట్, 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక ఆంధ్రా, నైజాంలో కుబేరా గత 4 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. నైజాంలో 11 కోట్ల రూపాయలు, సీడెడ్‌లో 3 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో 4 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 1.85 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.2 కోట్లు, గుంటూరులో 1.75 కోట్లు, కృష్ణా జిల్లాలో 1.7 కోట్లు, నెల్లూరులో 90 లక్షలు వసూలు చేసింది. గత 4 రోజుల్లో 25.6 కోట్ల రూపాయల నెట్, 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
కుబేరా సినిమా ఇండియా వైడ్‌గా వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 15 కోట్లు, 2వ రోజు 16.5 కోట్లు, 3వ రోజు 17.5 కోట్లు, 4వ రోజు 7 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, హిందీ రాష్ట్రాల్లో కలిపి 66 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా 26 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 92 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది అని సాక్ నిల్క్, ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇక కుబేరా 5వ రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 2.5 కోట్ల రూపాయలు షేర్, తమిళనాడులో 50 లక్షలు, కర్ణాటక, 75 లక్షలు, ఇతర రాష్ట్రాల్లో 25 లక్షలు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక ఓవర్సీస్‌లో ఈ మూవీ 1 కోటి రూపాయలు వసూలు చేస్తుంది. దాంతో 5వ రోజు ఇండియాలో 4 నుంచి 4.5 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 5 నుంచి 5.5 కోట్ల రూపాయల మధ్య వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దాంతో ఈ సినిమా 97 కోట్ల మేర వసూళ్లు సాధించి 100 కోట్లకు చేరువైంది. అయితే గీతా గోవిందం, యానిమల్, ఛావా తర్వాత మరో 100 కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకొన్నది.


Click it and Unblock the Notifications











