Kuberaa Day 6 Collections: నాగార్జున కెరీర్‌లో సరికొత్త చరిత్ర.. కుబేరాకు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం కుబేరా. సోషల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్వకత్వం వహించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో హిందీ నటులు జిబ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, దివ్య డెకాటే, కౌశిక్ మహతా, హరీష్ పెరాడీ తదితరులు నటించారు. ఈ సినిమాకు నికెత్ బొమ్మిరెడ్డి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, 5 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
కుబేరా మూవీలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక విభాగాల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులు కలిపి ఈ సినిమాను సుమారుగా 125 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా ప్రొమోలు, ప్రమోషన్స్‌తో ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. కుబేరాలోని స్టార్ వాల్యూతో ఈ సినిమా బిజినెస్ భారీగానే జరిగింది. తెలుగు రాష్ట్రాల బిజినెస్ 33 కోట్లు, తమిళనాడులో 18 కోట్ల రూపాయలు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల బిజినెస్ సుమారుగా 5.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 8.5 కోట్ల రూపాయలు మేర బిజినెస్ జరిగింది. ఈ మూవీ సినిమా బిజినెస్ ఓవరాల్‌గా 65 కోట్ల రూపాయలు మేర జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఈ చిత్రం 130 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలు పెట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో కుబేరా సినిమా తొలి రోజు 7 కోట్ల రూపాయలు, రెండో రోజు 7.25 కోట్లు, మూడో రోజు 7.75 కోట్లు, నాలుగు రోజుల్లో 3 కోట్ల రూపాయలు, 5వ రోజు 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 27.5 కోట్ల రూపాయల నెట్, 50 కోట్ల రూపాయల షేర్ వసూలు సాధించింది. నైజాంలో 12 కోట్లు, సీడెడ్‌లో 4 కోట్లు, ఆంధ్రాలో 11.5 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగేతర రాష్ట్రాల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో 16 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 7 కోట్ల రూపాయలు, కేరళలో 1 కోటి రూపాయలు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమా 26 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
కుబేరా చిత్రానికి ఓవర్సీస్‌లో మంచి స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల తర్వాత కేవలం నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా నార్త్ అమెరికాలో 2 మిలియన్ డాలర్లు అంటే 17.5 కోట్లకుపైగా వసూళ్లను, ఇతర దేశాల్లో కలిపి ఈ సినిమా 28 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరింది.
కుబేరా చిత్రం 6వ రోజు కూడా స్ట్రాంగ్‌గానే కనిపిస్తున్నది. ఈ సినిమా ఇండియాలో 4 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 6.5 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని సాక్ నిల్క్, ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రం 5వ రోజున బాక్సాఫీస్ వద్ద అరుదైన మైలురాయిని చేరుకొన్నది. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో ఈ సినిమా కలెక్షన్ల మోత మోగించింది. ఈ సినిమా ధనుష్ కెరీర్‌లో 4వ 100 కోట్ల చిత్రం కాగా, నాగార్జున కెరీర్‌లో తొలి 100 కోట్ల మూవీ కావడం విశేషం. ఈ సినిమా రానున్న రోజుల్లో మరిన్నీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











