Kuberaa Day 7 Collections: క్షీణించిన కుబేరా కలెక్షన్లు.. నష్టాల్లో నుంచి బయటపడాలంటే?
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం కుబేరా. సోషల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్వకత్వం వహించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో హిందీ నటులు జిబ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, దివ్య డెకాటే, కౌశిక్ మహతా, హరీష్ పెరాడీ తదితరులు నటించారు.
ఈ సినిమాకు నికెత్ బొమ్మిరెడ్డి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, 5 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కుబేరా మూవీలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక విభాగాల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులు కలిపి ఈ సినిమాను సుమారుగా 145 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా ప్రొమోలు, ప్రమోషన్స్‌తో ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. కుబేరాలోని స్టార్ వాల్యూతో ఈ సినిమా బిజినెస్ భారీగానే జరిగింది అని ట్రేడ్ వర్గాలు తమ రిపోర్టులో వెల్లడించాయి.
తెలుగు రాష్ట్రాల బిజినెస్ 33 కోట్లు, తమిళనాడులో 18 కోట్ల రూపాయలు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల బిజినెస్ సుమారుగా 5.5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 8.5 కోట్ల రూపాయలు మేర బిజినెస్ జరిగింది. ఈ మూవీ సినిమా బిజినెస్ ఓవరాల్‌గా 65 కోట్ల రూపాయలు మేర జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. ఈ చిత్రం 130 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలు పెట్టింది.
కుబేరా సినిమా గత 6 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా తెలుగులో 46.5 కోట్ల నెట్, తమిళంలో 18 కోట్లు, కన్నడలో 4 కోట్లు, హిందీలో 2 కోట్లు, కేరళలో 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ఆరు రోజుల్లో 73 కోట్ల రూపాయల నెట్, 77 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా తొలివారాంతంలో భారీగానే వసూళ్లను రాబట్టింది. అయితే తొలి వారాంతం తర్వాత ఈ కలెక్షన్లు దారుణంగా క్షీణించాయి. ఈ సినిమా నార్త్ ఇండియాలో 2 మిలియన్ డాలర్లు అంటే.. 17 కోట్లు, ఇతర దేశాల్లో 10 కోట్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా 27 కోట్ల రూపాయలు ఓవర్సీస్ మార్కెట్‌లో వసూలు చేసింది అని సాక్ నిల్క్ వెల్లడించింది. దాంతో ఈ సినిమా ఇండియాలో 77 కోట్లు, ఓవర్సీస్‌లో కలిపి 27 కోట్లు కలిపి మొత్తంగా 104 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
కుబేరా సినిమా రోజు రోజుకు క్షీణిస్తూ వసూళ్లను నమోదు చేస్తున్నది. ఈ సినిమా 7వ రోజున ఇండియాలో 4 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 50 లక్షలు రాబట్టే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 4.5 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 108 కోట్ల రూపాయలు మేర వసూలు చేస్తుంది అని పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











