Kuberaa Day 8 Collections: కన్నప్ప ప్రభంజనంలో నిలబడ్డ కుబేర.. ధనుష్ మూవీకి 8వ రోజు ఎన్ని కోట్లంటే?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న నటించిన చిత్రం కుబేర. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజైంది. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్‌రావు, శేఖర్ కమ్ముల సంయుక్తంగా ఈ కుబేర చిత్రాన్ని నిర్మించారు. జిబ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, దివ్య డెకాటే, కౌశిక్ మహతా, హరీష్ పెరాడీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. నికెత్ బొమ్మిరెడ్డి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా.. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందజేశారు. ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, 8 రోజుల కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..

కుబేర బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి కుబేర సినిమాకు రూ.145 కోట్ల బడ్జెట్ అయినట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. పాన్ ఇండియా సినిమా కావడంతో దానికి తగిన నిర్మాణ విలువల కోసం నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా కుబేరాను నిర్మించారు. కథ డిమాండ్ చేయడంతో పలు రియల్ లొకేషన్స్‌లో కుబేర చిత్రీకరణ జరిపారు. టీజర్, ట్రైలర్లు, ధనుష్- నాగార్జున కాంబో కావడంతో కుబేరపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

Kuberaa Day 8 Box Office Collections Worldwide Rashmika Mandanna s Film good start for second week

కుబేర బిజినెస్ & బ్రేక్ ఈవెన్ టార్గెట్
దీనికి తగినట్లుగానే తమిళ, తెలుగు మార్కెట్స్‌లో థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.33 కోట్లు, తమిళనాడులో రూ.18 కోట్లు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా కలిపి రూ.5.5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.8.5 కోట్ల చొప్పున మొత్తంగా రూ.65 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కుబేర. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ.66 కోట్ల షేర్.. రూ.132 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైనప్పటికీ ఆశ్చర్యకరంగా తమిళంలో కుబేరకు చెప్పుకోదగ్గ బిజినెస్ జరగకపోవడం ట్రేడ్ వర్గాలనే ఆశ్చర్యంలో ముంచెత్తింది.

కుబేర 7 రోజుల వసూళ్లు
ధనుష్ - నాగార్జునల సినిమా 7 రోజుల వరకు ఇండియాలో కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాల్లోకి వెళితే.. తెలుగులో రూ.48 కోట్లు, తమిళంలో రూ.18 కోట్లు, కన్నడంలో రూ. 4 కోట్లు, హిందీలో రూ.2 కోట్లు, కేరళలో రూ. కోటి రాబట్టింది. దీంతో ఏడు రోజుల్లో కుబేర చిత్రం ఇండియా వైడ్‌గా రూ.73 కోట్ల నెట్.. రూ.78 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

కుబేర ఓవర్సీస్ కలెక్షన్స్
శేఖర్ కమ్ముల, ధనుష్ సినిమాలకు ఓవర్సీస్‌లో మంచి బేస్ ఉంది. దీదంతో ఫస్ట్ వీకెండ్‌లో కుబేరకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఎప్పుడైతే వర్కింగ్ డేస్ మొదలయ్యాయో నాటి నుంచి ఓవర్సీస్‌లో వసూళ్లు డ్రాప్ అవుతూ వచ్చాయి. 8 రోజుల వరకు కుబేర సినిమాకు ఓవర్సీస్‌లో రూ.27.5 కోట్ల వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

కుబేర 8వ రోజు కలెక్షన్స్
మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా జూన్ 27న రిలీజైంది. అయినప్పటికీ కన్నప్ప ప్రభంజనాన్ని తట్టుకుని నిలబడ్డ కుబేరకు తెలుగులో 23.75 శాతం, తమిళంలో 17.45 శాతం, హిందీలో 10.22 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిల్క్ తెలిపింది. 8వ రోజు సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ.2.1 కోట్లు, తమిళంలో రూ.37 లక్షలు, కన్నడంలో రూ.20 లక్షలు, హిందీలో రూ.30 లక్షల చొప్పున ఇండియా వైడ్ రూ.3 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. దీంతో 8 రోజుల వరకు ఇండియాలో రూ.81.5 కోట్ల గ్రాస్, ఓవర్సీస్‌లో రూ.26.5 కోట్లు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.108 కోట్ల రూపాయలు వసూలు చేసింది కుబేర. ఈ వీకెండ్‌లో శేఖర్ కమ్ముల చిత్రం మరోసారి మ్యాజిక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

More from Filmibeat

Read more about: Kuberaa dhanush box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X