Kuberaa Day 9 Collections: అక్కడ డిజాస్టర్ దిశగా కుబేర.. ధనుష్ మూవీ నష్టాలు తప్పించుకోవాలంటే?

అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న నటించిన చిత్రం కుబేర. జిబ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, దివ్య డెకాటే, కౌశిక్ మహతా, హరీష్ పెరాడీ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్‌రావు, శేఖర్ కమ్ముల సంయుక్తంగా ఈ కుబేర చిత్రాన్ని నిర్మించారు. నికెత్ బొమ్మిరెడ్డి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా.. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందజేశారు. ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్, 9 రోజుల కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..

కుబేర బడ్జెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి కుబేర సినిమాకు రూ.145 కోట్ల బడ్జెట్ అయినట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.33 కోట్లు, తమిళనాడులో రూ.18 కోట్లు, కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా కలిపి రూ.5.5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.8.5 కోట్ల చొప్పున మొత్తంగా రూ.65 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కుబేర. రూ.66 కోట్ల షేర్.. రూ.132 కోట్ల గ్రాస్ వసూళ్లే టార్గెట్‌గా కుబేర తన జర్నీ స్టార్ట్ చేసింది.

Kuberaa Day 9 Box Office Collections Worldwide Dhanush s Film going To Be Disaster in Tamil

కుబేర 8 రోజుల వసూళ్లు
ధనుష్ - నాగార్జునల సినిమా 7 రోజుల వరకు ఇండియాలో కలెక్ట్ చేసిన వసూళ్ల వివరాల్లోకి వెళితే.. తెలుగులో రూ.51 కోట్లు, తమిళంలో రూ.18.23 కోట్లు, కన్నడంలో రూ.4.5 కోట్లు, హిందీలో రూ.2.16 కోట్లు, కేరళలో కోటి రూపాయలు రాబట్టింది. దీంతో 8 రోజుల్లో కుబేర చిత్రం ఇండియా వైడ్‌గా రూ.81 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకుంది.

కుబేర ఓవర్సీస్ కలెక్షన్స్
కుబేర విడుదలైన తొలి వారంలో ఓవర్సీస్‌లో వసూళ్ల వర్షం కనిపించింది. ధనుష్‌కు తోడు శేఖర్ కమ్ములకు కూడా నార్త్ అమెరికాలో మంచి ఇమేజ్ ఉండటంతో ప్రవాసులు ఈ సినిమాను బాగానే ఆదరించారు. అయితే ఫస్ట్ వీకెండ్ ముగిసిన నాటి నుంచి కుబేర కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వచ్చాయి. నార్త్ అమెరికా, గల్ఫ్, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాలలో ఇప్పటి వరకు ఈ చిత్రానికి రూ.27 కోట్ల వసూళ్లు వచ్చాయి.

కుబేర 9వ రోజు కలెక్షన్స్
వీకెండ్‌లో కుబేర మంచి హెల్డ్ సాధించింది. తెలుగులో 42.24 శాతం, తమిళంలో 31.31 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిల్క్ తెలిపింది. 9వ రోజు కుబేరా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ.3.5 కోట్లు, తమిళంలో రూ.40 లక్షలు, కన్నడంలో రూ.15 లక్షలు, హిందీలో రూ.43 లక్షల చొప్పున ఇండియా వైడ్ రూ.3 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. దీంతో 9 రోజుల వరకు ఇండియాలో రూ.85 కోట్ల నెట్, రూ.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఓవర్సీస్‌ కలెక్షన్స్ రూ.26.5 కోట్లు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.116 కోట్ల రూపాయలు వసూలు చేసింది కుబేర.

తమిళంలో డిజాస్టర్ దిశగా కుబేర
తెలుగు వెర్షన్‌లో అంచనాలను మించిపోయిన కుబేర.. 8వ రోజునే ఇక్కడ 50 కోట్ల నికర వసూళ్లు సాధించి ధనుష్‌కు సరికొత్త రికార్డు అందించింది. కానీ తమిళంలో మాత్రం ఇప్పటి వరకు రూ.20 కోట్ల మార్క్‌ను చేరుకోలేదు కుబేర. ఇదే తమిళ డిస్ట్రిబ్యూటర్లను కలవరపాటుకు గురిచేసింది. ధనుష్ హీరోగా ఉన్నప్పటికీ, అద్భుతంగా నటించాడని రివ్యూలు వచ్చినప్పటికీ కుబేరను కోలీవుడ్ ప్రేక్షకులు ఆదరించడం లేదు. కుబేర తమిళ రైట్స్‌ను రూ.20 కోట్లకు విక్రయించగా.. తమిళంలో ఈ చిత్రం 9 రోజుల వరకు రూ.19.35 కోట్ల నికర వసూళ్లను మాత్రమే సాధించింది. ఇక్కడ క్లీన్ హిట్ కావాలంటే కుబేరా ఇంకా 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది. విజయ్ ఆంటోనీ మార్గన్, మంచు విష్ణు నటించిన కన్నప్పకి తోడు తమిళంలో చిన్నా పెద్దా సినిమాలు రిలీజ్‌లు ఉండటంతో కుబేర థియేట్రికల్ రన్ సాఫీగా సాగే అవకాశాలు కనిపించడం లేదు. మరి ధనుష్ తన సొంత రాష్ట్రంలో ఎలాంటి మేజిక్ చేస్తాడో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: Kuberaa dhanush box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X