Kuberaa OTT Business: రికార్డు ధరకు కుబేరా ఓటీటీ రైట్స్.. ధనుష్, నాగ్ మూవీ హక్కులు ఎవరికంటే?
సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు నాగార్జున అక్కినేని, ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలిసి నటించిన సోషల్ థ్రిల్లర్ కుబేరా. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా రూపొందించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. జూన్ 20 తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలు ఊపందుకొంటున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా బిజినెస్ వ్యవహారాలు ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ రైట్స్ విషయానికి వస్తే..
తెలుగు సినిమా రంగంలో ప్రముఖ నిర్మాతలు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మాతలుగా రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు జిమ్ సరభ్, దలీప్ తాహిల్ నటించారు. ఈ సినిమాకు నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫి, దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాను సుమారుగా 120 కోట్ల రూపాయలతో నిర్మించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

కుబేరుడు అంటే సంపదకు దేవుడు. ఈ సినిమా పేరు తగినట్టే అంతా డబ్బు చుట్టే తిరుగుతుండటం జరుగుతుంది. పేదవాడు సంపన్నుడిగా మారడానికి ఎలాంటి ఎత్తులు వేశాడు. మధ్య తరగతి కుటుంబ సంబంధాలు, వారి మధ్య భావోద్వేగాలను దర్శకుడు శేఖర్ కమ్ముల స్టైల్‌లో తెరకెక్కించారనేది ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. నాగార్జున, ధనుష్ మధ్య సన్నివేశాలు ఓ రేంజ్‌లో ఉంటాయనే చెప్పుకొంటున్నారు. నాగ్, ధనుష్, రష్మిక ఉండటంతో అంచనాలు మించిపోయాయి. ఈ మధ్య రిలీజైన పాట ట్రెండింగ్‌గా మారింది.
సినిమా పరిశ్రమలో డిజిటల్ రైట్స్, శాటిలైట్ బిజినెస్ వ్యవహారాలు కష్టంగా ఉన్నాయనే విషయం ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్నది. చాలా సినిమాలు ఓటీటీ బిజినెస్ కావడం లేదనే మాట బలంగా వినిపిస్తున్నది. మరికొన్ని సినిమాలు ఓటీటీ సంస్థల షరతులకు లోబడితే గానీ బిజినెస్ కావడం లేదని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ బిజినెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
అయితే కుబేరా సినిమాలో స్టార్ వాల్యూ, టెక్నికల్ క్రూ వాల్యూ హై రేంజ్‌లో ఉండటం స్పెషల్ ఎట్రాక్షన్. అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ చేజిక్కించుకొనేందుకు పలు సంస్థలు భారీగా పోటీ పడ్డాయి. కానీ చివరకు ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకొన్నది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను సుమారుగా 50 కోట్ల రూపాయలు చెల్లించి అమెజాన్ సొంతం చేసుకొన్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా, ఈ సినిమా శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ కోసం కూడా భారీగానే డిమాండ్ ఉంది. ఈ సినిమా హక్కుల కోసం పలువురు డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబ్యూటర్లు ఆసక్తి చూపుతున్నారు. ప్రముఖ ఛానెల్స్ శాటిలైట్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ డీల్స్ కూడా త్వరలోనే పూర్తి అవుతాయి. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉండటంతో హక్కుల కోసం కూడా డిమాండ్ ఎక్కువగానే ఉందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











