Kuberaa Business: రికార్డు ధరకు కుబేరా థియేట్రికల్ రైట్స్.. ఎన్ని కోట్ల బిజినెస్ అంటే?
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లు ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్న కలిసి నటించిన చిత్రం కుబేరా. సోషల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్వకత్వం వహించారు. ఈ సినిమాకు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా జూన్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్, తెలుగు రాష్ట్రాల బిజినెస్ వివరాల్లోకి వెళితే..
దక్షిణాదిలో హీరో ధనుష్‌కు ఉన్న పాపులారిటీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన సినిమాలకు మంచి రెస్పాన్స్‌తో బాక్సాఫీస్ కమర్షియల్స్, అలాగే అవార్డులు కూడా గెలుచుకోవడం సర్వసాధారణమైంది. ఇక ఇండియన్ సినిమాలో కింగ్ నాగార్జునకు ఉన్న క్రేజ్ ఈనాటిది కాదు. ఈ సినిమాకు వీరిద్దరి కాంబినేషన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారడమే కాకుండా భారీ హైప్ క్రియేట్ చేసింది.

రష్మిక మందన్న లాంటి హీరోయిన్, అలాగే దేవీ శ్రీ ప్రసాద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్, ఇంకా టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ ఈ సినిమాకు పనిచేశారు. ఈ సినిమా ప్రొడక్షన్ ఖర్చులు, నటీనటుల, సాంకేతిక నిపుణుల రెమ్యురనేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 120 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా టీజర్, పాటలు విడుదలై మంచి బజ్ క్రియేట్ చేశాయి.
కుబేరా సినిమాకు వస్తున్న బజ్, క్రియేట్ అయిన హైప్‌తో బిజినెస్ వర్గాల్లో అంచనాలు పెరిగాయి. ఫ్యాన్సీ రేటుకు బిజినెస్ జరుగుతున్నాయనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నది. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ సుమారుగా 18 కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసింది. ఇక సీడెడ్, నైజాం కలిపి 22 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇంకా తమిళ, కన్నడ, ఇతర ప్రాంతాల బిజినెస్ వివరాలు అందాల్సి ఉంది.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందిన ఈ సినిమాలో హిందీ నటులు జిబ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, దివ్య డెకాటే, కౌశిక్ మహతా, హరీష్ పెరాడీ తదితరులు నటించారు. ఈ సినిమాకు నికెత్ బొమ్మిరెడ్డి, కార్తీక్ శ్రీనివాస్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను ఇండియా, ఓవర్సీస్ మార్కెట్‌లో కలిపి సుమారుగా 4000 స్క్రీన్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అని తెలిసింది.
ఇదిలా ఉండగా, కుబేరా సినిమా ఓటీటీ రైట్స్‌కు రికార్డు రేటు పలికింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీపడ్డాయి. కానీ చివరకు ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకొన్నది. ఈ సినిమా రైట్స్ కోసం సుమారుగా 50 కోట్ల రూపాయలు చెల్లించినట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన శాటిలైట్, ఇతర హక్కుల కోసం భారీగానే డిమాండ్ ఉంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందే భారీ లాభాలను సంపాదించే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











