దటీజ్ రజనీ...

కేవంలం రిలీజయిన రెండు రోజుల్లో రెండు లక్షల ఆడియో సీ.డీ.ల అమ్మకం జరిపి కుశేలన్ సినిమా మరో రికార్డుని సొంతం చేసుకుంది. బిగ్ మ్యూజిక్ వారు రిలీజ్ చేసిన ఈ పాటలు ఎక్కడ చూసినా సౌత్ లో మారుమ్రేగుతున్నాయి. ఇక సాంగ్స్ క్యాసెట్స్ అయితే గ్రామీణ ప్రాంతాల్లో 50,000 లకు పైగా అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఇది రజనీ గత చిత్రం శివాజీ ని క్రాస్ చేసే రికార్డు.
ఇక ఈ సంతోషాన్ని బిగ్ మ్యూజిక్ సంస్ద ప్రతినిధులు సెలబ్రేట్ చేసుకుంటూ..."మేం మంచి మార్కెట్ ఉంటుందనుకుని ఆడియో రైట్స్ పెద్ద మొత్తానికి తీసుకున్నాం. అయితే మా ఊహ తప్పని తెలిసింది. మంచి మార్కెట్ కాదు ...అధ్భుతమైన సేల్స్ ఇవి. ఇప్పుడు మరో లక్ష సీ.డీలను అమ్మకానికి డెలవరీ చేసాం. రజనీ సార్ కి మా థాంక్స్. ఒక్క రజనీ మాత్రమే చెయ్యకల మేజిక్ ఇది" అంటున్నారు వాళ్ళు...


Click it and Unblock the Notifications











