twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి ఛీప్ గెస్ట్ ...ఆడియో లాంచ్ డేట్,వెన్యూ

    By Srikanya
    |

    హైదరాబాద్: కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఎస్‌.ఎల్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై జి.అనిల్‌కుమార్‌రాజు, వంశీకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కుందనపు బొమ్మ'. ఈ చిత్రాన్ని దర్శకుడు ముళ్ళపూడి వరా డైరక్ట్ చేస్తున్నారు. చిత్రం ఆడియో ఈ నెల 30న పార్క్ హయిత్ హోటల్ హైదరాబాద్ లో జరగనుంది. రాజమౌళి గెస్ట్ గా ఈ ఆడియో పంక్షన్ కు వస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తు తం పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు కూడా ముగింపుకు చేరు కున్నాయి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    దర్శకుడు మాట్లాడుతూ... ‘‘బాపు గీసిన బొమ్మలాంటి అమ్మాయి సుచి. ఆమె ప్రేమను కోరుతూ వెంటపడే ఇద్దరు యువకులు. వారిద్దరిలో సుచి ఎవరిని ఇష్ట్టపడిందనేది తెరపైనే చూడాలి అన్నారు వరా ముళ్ళపూడి. అలాగే... ‘‘పల్టెటూరి నేపథ్యంలో సాగే కుటుంబ కథాచిత్రమిది. ఏడాదిన్నరగా ఈ సినిమా చేస్తున్నాం. మా గురువు రాఘవేంద్రరావుగారికి 43కథలు చెబితే అందులో ఈ కథ నచ్చింది. అచ్చమైన తెలుగు సినిమా ఇది'' అని అన్నారు.

    చిత్ర నిర్మా తలలో ఒకరైన జి. అనిల్‌కు మార్‌ రాజు చిత్ర విశేషాలను తెలియ జేస్తూ.. పల్లెటూరి ప్రేమకథా చిత్ర మిది. దీనిని విజయనగరం, బొబ్బిలి మొదలగు ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. మిగిలిఉన్న ఒక్క డ్యూయెట్‌ సాంగ్‌ని పాలకొల్లులోనూ, ఆ సమీప ప్రాంతాలైన యలమంచలి లంక, శంకరగుప్తం మున్నగు ప్రాంతాల్లోని సుందరమైన లోకేషన్స్‌లో చాందినీ చౌదరి, సుధీర్‌లపైన చిత్రీకరించడం జరిగింది. సంగీత దర్శకులు ఎమ్‌. ఎమ్‌. కీరవాణి చాలా మంచి పాటలను ఇచ్చారు. మా దర్శకులు ముళ్ళపూడి వరా, స్వచ్ఛమైన తెలుగుదనం ఉట్టిపడే కథను వెండితెరకు ఎక్కించారు. యువత మెచ్చే రీతిలో ఈ తరం ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఈ కథలో ఉంటాయి. అలాగే అన్ని తరగతుల ప్రేక్షకుల్ని..ముఖ్యంగా మహిళా లోకాన్ని ఈ చిత్రం మెప్పిస్తుందని చెప్పారు.

    Kundanapu Bomma audio launch date confirmed

    కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘బాపు రమణలు నాకు ఆత్మీయులు. బాపు రమణల సినిమా ఆస్తికి వరా వారసుడు. మంచి కథతో ఈ సినిమా చేశాడు. ప్రేక్షకాదరణ పొందుతుంది'' అని అన్నారు.

    English summary
    Kundanapu Bomma, film’s audio will be launched on the 30th of this month at Park Hyatt in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X