Kung Fu Panda 4 Collections 700 కోట్ల బడ్జెట్.. ఫస్ట్ వీక్ 920 కోట్ల కలెక్షన్లు.. ఇండియాలో ఎంతంటే?
డ్రీమ్ వర్క్స్ యానిమేషన్ బ్యానర్‌పై యూనివర్సల్ పిక్చర్స్ సహకారంతో మార్చి 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కుంగ్ ఫూ పాండా 4. మైక్ మిచెల్ దర్శకత్వంలో ఈ సినిమాను రెబాకా హంట్‌లీ నిర్మించారు. ఈ మూవీలో జాక్ బ్లాక్, అక్వాఫినా, బ్రైన్ క్రన్‌స్టన్, ఇయాన్ మెక్ షేన్, కీ హ్యూ క్వాన్, డస్టిన్ హాఫ్‌మెన్, వోలా డేవిస్ తదితరులు నటించారు. ఈ సినిమా బడ్జెట్, బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
కుగ్ ఫూ పాండా 3 సినిమా భారీ విజయం సాధించడంతో 4వ సీక్వెల్‌కు ప్లాన్ చేశారు. ఈ సినిమాను అత్యధిక వ్యయంతో రూపొందించారు. ఈ సినిమాను సుమారుగా 85 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 705 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అయితే 3వ సీక్వెల్‌ను 145 మిలియన్ డాలర్లతో నిర్మిస్తే..అంతకంటే తక్కువగా బడ్జెట్‌తో రూపొందించారు.

కుంగ్ ఫూ పాండా 4 సినిమాకు ఎక్కువగా డిమాండ్ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాను నార్త్ అమెరికాలో 4 వేల స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అమెరికా, ఇతర దేశాల్లో మార్చి 8వ తేదీన రిలీజ్ కాగా, ఇండియాలో ఈ సినిమాను మార్చి 15వ తేదీన విడుదల చేశారు.
ఇండియాలో ఈ చిత్రానికి అంతంత మాత్రంగానే ఆదరణ లభించింది. హిందీ బెల్ట్‌లో 30 శాతం, తెలుగు వెర్షన్‌కు 25 శాతం, కన్నడ వెర్షన్‌కు 20 శాతం, తమిళంలో 25 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. అయితే ఈ సినిమా అనుకొన్నంత మేరకు ప్రేక్షకులను రప్పించలేకపోయింది. ఇండియాలో పరీక్షల సమయం కావడంతో అంతగా అటెన్షన్ పొందలేకపోతున్నది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

భారత్‌లో ఈ సినిమా తొలి రోజు 2.5 కోట్ల రూపాయల నికర వసూళ్లను సాధించింది. హిందీ వెర్షన్ 30 లక్షల వసూళ్లు రాబడితే.. తెలుగు వెర్షన్ 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇక ఇంగ్లీష్ వెర్షన్‌కు 1.95 కోట్లు రాబట్టింది. ఇక రెండో రోజు ఈ సినిమా 2 కోట్ల రూపాయాలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా మొత్తంగా 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక నార్త్ అమెరికాలో ఈ చిత్రం తొలివారం 80 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 104 మిలియన్ డాలర్లు రాబట్టింది. దాంతో ఈ సినిమా తొలివారం 110 మిలియన్ డాలర్లను వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











