Kushi Advance booking Collections విజయదేవరకొండ బాక్సాఫీస్ వసూళ్లు కేక.. ఖుషి మూవీ కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, దక్షిణాది స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు నటించిన ఖుషి విడుదలకు సిద్దమైంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఏర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు అనూహ్య స్పందన లభించడంతో అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ రెస్పాన్స్ కనిపించింది. ఈ సినిమా తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

ఖుషి మూవీకి అన్ని ప్రాంతాల్లో భారీగా వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదు అవుతున్నాయి. పాన్ ఇండియా రిలీజ్‌తో ముందుకొస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్నది. అన్ని భాషల్లోనూ ఈ సినిమాకు మంచి రెస్సాన్స్ కనిపిస్తున్నది. ఇండియా, ఓవర్సీస్‌లో పాజిటివ్ నోట్‌తో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది.

Kushi movie day 1 advance booking Collections worldwide

ఖుషి మూవీ ఏపీ, నైజాంలో అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే.. నైజాంలో 750 షోలకు గాను అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. కడపటి వార్తలు అందే సరికి 45 శాతం ఆక్యుపెన్సీతో 2.7 కోట్లు వసూలు చేసింది. ఇక ఆంధ్రా విషయానికి వస్తే.. 900 కిపైగా షోలకు 1.6 కోట్లు నమోదు చేసింది. దాంతో ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 4.3 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది.

Kushi movie day 1 advance booking Collections worldwide

ఇక తెలుగేతర రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే.. కన్నడలో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. కర్ణాటక వ్యాప్తంగా 260 షోలకు గాను 30 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమాకు 40 లక్షల రూపాయలు, తమిళనాడులో 170 షోలకు గాను.. 25 శాతం ఆక్యుపెన్సీతో 20 లక్షల రూపాయలు, పాండిచ్చేరిలో 85 వేలు, కేరళలో 70 వేలు, గుజరాత్‌లో 60 వేలు, మహారాష్ట్రలో 30 వేల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదయ్యాయి.

Kushi movie day 1 advance booking Collections worldwide

ఖుషీ మూవీకి ఓవర్సీస్‌లో భారీ రెస్సాన్స్ కనిపిస్తున్నది. ఈ సినిమాకు ఆస్ట్రేలియాలో మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఆస్టేలియాలో పలు ప్రాంతాల్లో భారీ ఓపెనింగ్స్ కనిపించాయి. 73 షోల కోసం 2200 టికెట్లు అమ్ముడుపోగా 40K ఆస్ట్రేలియా డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 22 లక్షల రూపాయల వసూళ్లు నమోదు అయ్యాయి.

అమెరికాలో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నది. ఖుషి సినిమా కోసం 328 లోకేషన్లలో 809 షోల ద్వారా 16 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ చిత్రానికి 3 లక్షల యూఎస్ డాలర్లు వసూలు అయ్యాయి. ప్రీమియర్లు మొదలయ్యే సరికి సుమారు 500K డాలర్లు అంటే 40 లక్షల రూపాయలు కలెక్షన్లు నమోదు అయ్యాయి.

Kushi movie day 1 advance booking Collections worldwide

ఖుషి మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ఇండియాలో ఇప్పటికే 4.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో మరో ఒక కోటి రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సినిమా 6 నుంచి 7 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదు చేసే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X