Kushi Collections విజయ్ దేవరకొండ కెరీర్‌లో బిగ్గెస్ ఓపెనింగ్స్.. వరల్డ్ వైడ్ ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ సంయుక్తంగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ఖుషి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు జంటగా నటించిన క్లీన్ రొమాంటిక్ కామెడీ చిత్రం సెప్టెంబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. రిలీజ్‌కు ముందే ఈ సినిమా మ్యూజికల్‌గా హిట్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగినట్టే ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా భారీగా నమోదు అయ్యాయి. ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే...
ఖుషి సినిమా భారీ తారాగణం, అత్యుత్తమ సాంకేతిక నిపుణులతో మైత్రీ మూవీస్ తెరకెక్కించారు. మురళీ శర్మ, సచిన్ ఖేడ్కర్, జయరాం, శరణ్య, రోహిణి, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ లాంటి యాక్టర్లు ప్రధాన పాత్రలతో సినిమాకు బలంగా మారారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ భారీగాన పెరిగిపోయింది. ఖుషి మూవీని దాదాపు 100 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు.

ఖుషి మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ కనిపించింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు 35 కోట్ల రూపాయల మేర విలువ కట్టారు. తెలుగేతర రాష్ట్రాల హక్కులు అంటే కర్ఖాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 8 కోట్లు, ఓవర్సీస్ హక్కులు 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ 53 కోట్ల రూపాయలు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఖుషి మూవీకి రిలీజ్ ముందు భారీగా బజ్ క్రియేట్ కావడంతో భారీగా స్క్రీన్లలో రిలీజ్ చేశారు. నైజాంలో 300 స్క్రీన్లు, సీడెడ్‌లో 200 స్క్రీన్లు, ఆంధ్రాలో 400 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 900 స్క్రీన్లలో రిలీజ్ చేయడం జరిగింది. ఇక కర్ణాటక 120 స్క్రీన్లు, ఓవర్సీస్‌లో 500 స్క్రీన్లలో రిలీజ్ చేవారు. దాంతో మొత్తంగా సుమారు 550 స్క్రీన్లలో రిలీజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఖుషీ మూవీకి యూఎస్ ప్రీమియర్ల టాక్ పాజిటివ్‌గా మారింది. యూఎస్‌లో పాజిటివ్ టాక్ కారణంగా దేశవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ నమోదయ్యాయి. తెలుగులో మార్నింగ్ షోకు 55 శాతం, మధ్యాహ్నం 60 శాతం, ఫస్ట్ షోకు 60 శాతం, సెకండ్ షోలు 60 శాతం మేర ఆక్యుపన్సీ నమోదైంది. తమిళ్‌లో ఓవరాల్‌గా 51 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
ఇక ఖుషి కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 8 నుంచి 10 కోట్ల మధ్య వసూళ్లు, తెలుగేతర రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయల నికర కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ఇండియాలో 12 నుంచి 14 కోట్ల కలెక్షన్లు నమోదు కావొచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 24 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసే ఛాన్స్ కనిపిస్తున్నది.

విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమా బ్రేక్ ఈవెన్ వివరాల్లోకి వెళితే.. బాక్సాఫీస్ వద్ద భారీగానే లక్ష్యం ఉంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 55 కోట్ల షేర్, 105 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. ఈ సినిమా ఆ రేంజ్ కలెక్షన్లు ఎన్ని రోజుల్లో సాధిస్తుందనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











