twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kushi 2 days collections: రీ రిలీజ్ లో పవర్ స్టార్ బీభత్సం.. ఇది నెవ్వర్ బిఫోర్ రికార్డ్!

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ హోదా ఏ స్థాయిలో ఉంటుందో ఖుషి సినిమా రీ రిలీజ్ తో మరోసారి అర్థమయింది. ఈ సినిమా వచ్చి 20 ఏళ్ళు దాటినా కూడా ఫ్యాన్స్ ఏమాత్రం మర్చిపోలేదు. ఇక రీ రిలీజ్ ట్రెండ్ లో ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇక జనవరి 1వ తేదీన కూడా ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక మొత్తంగా ఇప్పటివరకు ఖుషి సినిమా రీ రిలీజ్ లో ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

    20 ఏళ్ళ తరువాత కూడా..

    20 ఏళ్ళ తరువాత కూడా..

    ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఎఏం.రత్నం నిర్మించిన ఖుషి సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భూమిక జంటగా నటించారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇక ఈ సినిమాకు పర్ఫెప్ట్ కాంబినేషన్ సెట్ కావడంతో అప్పట్లోనే బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో అంచనాలను క్రియేట్ చేసింది. 20 ఏళ్ల తర్వాత కూడా హడావిడి ఏమాత్రం తగ్గలేదు అని చెప్పాలి.

    ఫ్యాన్స్ డిమాండ్ మేరకు

    ఫ్యాన్స్ డిమాండ్ మేరకు

    నిర్మాత AM రత్నం ఖుషి సినిమాను 4K టెక్నాలజీతో అప్డేట్ చేసి డిసెంబర్ 30వ తేదీన విడుదల చేయడం జరిగింది. అయితే మొదట కొన్ని లిమిటెడ్ థియేటర్లలోనే ఈ సినిమాలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఫ్యాన్స్ నుంచి వచ్చిన డిమాండ్ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముందుగా అనుకున్న థియేటర్ల కంటే ఎక్కువ స్థాయిలో విడుదల చేయాల్సి వచ్చింది.

     రెండవ రోజు కలెక్షన్స్

    రెండవ రోజు కలెక్షన్స్

    ఇక ఖుషి సినిమా రీ రిలీజ్ ట్రెండ్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి బాక్సాఫీస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొదటి రోజే 3.62 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఆదివారం రోజు న్యూ ఇయర్ కావడంతో మరింత ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా ఆదివారం రోజున సినిమా 1.52 కోట్లను అందుకుంది.

    వరల్డ్ వైడ్ రీ రిలీజ్ కలెక్షన్స్

    వరల్డ్ వైడ్ రీ రిలీజ్ కలెక్షన్స్

    ఖుషి రీ రిలీజ్ రెండు రోజుల కలెక్షన్స్ ఏరియాలో వారిగా ఈ విధంగా ఉన్నాయి. నైజం ఏరియాలో ఈ సినిమా 2.30 కోట్లను అందుకోగా ఆంధ్రాలో 2.20 కోట్లు సొంతం చేసుకుంది. దీంతో ఏపీ తెలంగాణలో 5.14 కోట్లు వచ్చాయి. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో మొత్తంగా 52 లక్షల రాగా ఓవర్సీస్ లో 25 లక్షలు అందుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 5.91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

    ఖుషి ఊహించని రికార్డ్

    ఖుషి ఊహించని రికార్డ్

    ఖుషి సినిమా రీ రిలీజ్ ట్రెండ్ లో అయితే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటివరకు తెలుగులో రీ రిలీజ్ అయిన సినిమాలలో ఖుషి సినిమా అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఇంతకు ముందు జల్సా సినిమాకు అత్యధికంగా కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఈ సినిమా రెండు రోజుల్లోనే ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఆ తర్వాత పోకిరి సినిమా చెన్నకేశవరెడ్డి బిల్లా సినిమాలు తర్వాత స్థానంలో ఉన్నాయి.

    English summary
    Kushi movie re release 2 days worldwide box office collections..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X