L2: Empuraan Business: ఎంపురాన్ టార్గెట్ 300 కోట్లు.. వరల్డ్ వైడ్ బిజినెస్ ఎంతంటే?
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, స్టార్ హీరో అండ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం L2: ఎంపురాన్. శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమాను ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. రంజాన్ కానుకగా ఈ చిత్రం మార్చి 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా బడ్జెట్, బిజినెస్ వివరాల్లోకి వెళితే..
లూసిఫర్ మూవీకి సీక్వెల్‌గా రూపొందించిన ఎంపురాన్‌లో మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్‌తోపాటు మంజు వారియర్, టొవినో థామస్, అభిమన్యు సింగ్, సాయికుమార్, సూరాజ్ వెంజరాముడు, ఫాజిల్, సచిన్ ఖేడ్కర్, సానియా అయ్యప్పన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ తదితరులు నటించారు. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫి, దీపక్ దేవ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా ఖర్చుకు వెనుకాడకుండా విదేశాల్లో భారీగా తెరకెక్కించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 150 కోట్లకుపైగానే అయిందని దిల్ రాజు ఇటీవల ప్రెస్ మీట్‌లో వెల్లడించారు.

ఇక లూసిఫర్ సినిమాపై ఉన్న క్రేజ్, దానికి సీక్వెల్ వస్తున్న ఎంపురాన్‌పై రెండింతలు పెరిగాయి. దాంతో ఈ సినిమా బిజినెస్ భారీగా వాల్యూ కట్టడం జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 100 కోట్లుగా వాల్యూ కట్టారు. ఇండియా థియేట్రికల్ రైట్స్ 70 కోట్లు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ సుమారు 30 కోట్లుగా విలువ కట్టారు. ఈ సినిమాను కొన్ని డిస్టిబ్యూటర్లు కమిషన్ బేస్ మీద రిలీజ్ చేస్తుండటంతో ఈ థియేట్రికల్ బిజినెస్ వాల్యూపైనే ఆధారపడి ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
L2: ఎంపురాన్ సినిమాను దేశంలోనే టాప్ డిస్ట్రిబ్యూటర్ అనీల్ తడాని హిందీ వెర్షన్‌ను రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్‌రాజుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ విడుదల చేస్తున్నది. కర్ణాటకలో ప్రముఖ సంస్థ హోంబలే ఫిల్మ్స్ రిలీజ్ చేస్తోంది. తమిళనాడులో గోకులం గోపాలన్ కి చెందిన శ్రీ గోకులం మూవీస్ ద్వారా విడుదల చేస్తున్నాం అని దర్శకుడు, హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ వెల్లడించారు.
ఎంపురాన్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయంలో జాప్యం జరిగింది. ఈ సినిమా రైట్స్‌కు సంబంధించిన రేట్ల విషయంలో బేరసారాలు కుదర్లేదు. అందుకే థియేట్రికల్ బిజినెస్ జరగకుండా కమిషన్ బేస్‌లో రిలీజ్ చేయడం జరుగుతున్నది. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో ఈ సినిమాపై ఓటీటీ సంస్థలు భారీగా ఆసక్తిని చూపుతున్నాయి. సినిమా టాక్‌ను, సాధించే సక్సెస్‌ను బట్టి ఈ సినిమా బిజినెస్ ఫైనల్ అవుతుంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఎంపురాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన వ్యక్తమవుతున్నది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. ఈ సినిమా తొలి రోజు సుమారుగా 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్‌లో 2 మిలియన్ డాలర్లు కలెక్షన్లు అంటే సుమారుగా 17 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా మలయాళ సినిమా రంగంలో తొలి 300 కోట్ల రూపాయలు సాధించే చిత్రంగా రికార్డు క్రియేట్ చేస్తుందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు జోస్యం చెప్పారు.


Click it and Unblock the Notifications











