L2: Empuraan day 1 Collections: ఎంపురాన్‌కు రికార్డు కలెక్షన్లు.. మోహన్ లాల్ మూవీకి ఎన్ని కోట్లంటే?
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, స్టార్ హీరో అండ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన ఎంపురాన్ చిత్రం పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. టోవిన్ థామస్, మంజు వారియర్, సచిన్ ఖేడ్కర్, అభిమన్యు సింగ్, సాయికుమార్, సూరాజ్ వెంజరాముడు, ఫాజిల్, సచిన్ ఖేడ్కర్, సానియా అయ్యప్పన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ తదితరులు నటించిన ఈ చిత్రం మార్చి 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమాను ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. ఈ మూవీ బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? సాక్ నిల్క్ వెల్లడించిన ప్రకారం తొలి రోజు నమోదు చేసిన కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే..
ఎంపురాన్ సినిమాలో భారీ తారాగణం, టాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేశారు. అమెరికా, యూకే, దుబాయ్, పలు దేశాల్లో ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను షూట్ చేశారు. అలాగే యాక్షన్ సీన్లు భారీగా ప్లాన్ చేశారు. దాంతో మలయాళ సినీ పరిశ్రమలో తొలిసారి 150 బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 4500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. మోహన్‌లాల్ కెరీర్‌లో ఇంతకుముందెన్నడూ లేని విధంగా గ్రాండ్‌గా విడుదల చేశారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక లూసిఫర్ సినిమాకు సీక్వెల్ కావడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగినట్టుగానే ఈ సినిమా టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకు కేరళ, తమిళం, కన్నడ, తెలుగుతోపాటు ఓవర్సీస్‌లో ప్రీ సేల్స్ బుకింగ్‌కు భారీ స్పందన లభించింది. ఈ సినిమాకు కేరళలోనే 12 కోట్లకుపైగా కలెక్షన్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో నమోదైంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారుగా 60 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది.
ఎంపురాన్ సినిమా బిజినెస్ భారీగా వాల్యూ కట్టడం జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారుగా 100 కోట్లుగా వాల్యూ కట్టారు. ఇండియా థియేట్రికల్ రైట్స్ 70 కోట్లు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ సుమారు 30 కోట్లుగా విలువ కట్టారు. ఈ సినిమాను కొన్ని డిస్టిబ్యూటర్లు కమిషన్ బేస్ మీద రిలీజ్ చేస్తుండటంతో ఈ థియేట్రికల్ బిజినెస్ వాల్యూపైనే ఆధారపడి ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
లూసిఫర్ 2 సినిమాకు కేరళలో సూపర్‌గా ఆక్యుపెన్సీ నమోదైంది, దక్షిణాదిలో మోహన్ లాల్ సినిమాకు ఇంతకు ముందు లేని విధంగా రికార్డు ఆక్యుపెన్సీ కనిపించింది. మలయాళంలో మార్నింగ్ షోకు 70 శాతం, మ్యాట్నీకి 80 శావతం ఆక్యుపెన్సీ నమోదైంది. కోచి, త్రివేండ్రంలో 100 శాతం, బెంగళూరులో 80 శాతం, చెన్నైలో 75 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
లూసిఫర్ 2 మూవీ తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. ఈ చిత్రం 25 కోట్ల నెట్, 50 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది అని సాక్ నిల్క్, ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కేరళలో 12 కోట్లకుపైగా, 3 కోట్లు, తమిళనాడులో 1.5 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో 2.2 కోట్లు, ఓవర్సీస్‌లో 4 మిలియన్ డాలర్లు అంటే 35 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లు రాబట్టింది.


Click it and Unblock the Notifications











