L2: Empuraan day 10 Collection : 250 కోట్లపై మోహన్‌లాల్ కన్ను.. ఎంపురాన్‌కు రికార్డు కలెక్షన్స్, ఎన్ని కోట్లంట

మలయాళ అగ్ర కథనాయకుడు మోహన్ లాల్ , స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో తెరకెక్కిన వచ్చిన చిత్రమే ఎల్ 2: ఎంపురాన్. రెండేళ్ల క్రితం వచ్చిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం రంజాన్ కానుకగా మార్చి 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమాను గోకుళం గోపాలం, ఆంటోనీ పెరుంబవూర్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఎల్ 2 : ఎంపురాన్ బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? గత 10 రోజులుగా ఈ సినిమా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే :

L2 Empuraan day 10 Collection Mohan Lal s L2 heading towards 250 crores mark

ఎల్ 2 : ఎంపురాన్ బడ్జెట్ ఎంత ( L2: Empuraan Budget)?

లూసిఫర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు. దీనికి తగినట్లుగానే హై స్టాండర్డ్స్ రావడం కోసం ఎల్ 2 : ఎంపురాన్‌కు భారీగానే ఖర్చు చేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా ఎల్ 2 : ఎంపురాన్‌కు దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ అయ్యిందని మలయాళ ఇండస్ట్రీ టాక్.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత (L2: Empuraan Break Even Target)?

మలయాళ చిత్ర పరిశ్రమలో గతంలో ఏ సినిమాకు లేనివిధంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇండియాలో రూ.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.30 కోట్ల చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇండియాలో రూ.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.30 కోట్ల వ్యాపారం జరిగింది. ఎల్ 2 : ఎంపురాన్ లాభాల్లోకి రావాలంటే రూ.110 కోట్ల షేర్ .. రూ. 220 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

గత 9 రోజుల కలెక్షన్స్ ( L2: Empuraan 9 days collections)

విడుదలైన తొలి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న ఎల్ 2 : ఎంపురాన్.. వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డులు నమోదు చేసింది. అడ్వాన్స్ బుకింగ్‌తో రూ.60 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. రిలీజ్ రోజున రూ.22 కోట్లతో కలిపి ఈ సినిమా ఫస్ట్ డే రూ.82 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి మలయాళ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. రెండో రోజూ రూ. 17 కోట్లు అందుకుని కేవలం 48 గంటల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.

మూడో రోజు రూ.13.25 కోట్ల నెట్, నాలుగో రోజు రూ.13.65 కోట్ల నెట్, ఐదో రోజు రూ.11.15 కోట్ల నెట్, ఆరో రోజు రూ.8.55 కోట్ల నెట్, ఏడో రోజు రూ.5.65 కోట్ల నెట్ అందుకుంది. తొలి వారంలో 88.25 కోట్ల నెట్ సాధించింది ఎంపురాన్ . ఇందులో మలయాళం నుంచి రూ.80.7 కోట్లు నెట్, కర్ణాటకలో రూ.23 లక్షల నెట్, తెలుగులో రూ.2.37 కోట్ల నెట్, తమిళనాడులో రూ.2.89 కోట్ల నెట్, హిందీలో రూ. 2.06 కోట్ల నెట్ సాధించినట్లు సాక్ నిక్ తెలిపింది. ఎనిమిదవ రోజు రూ.3.9 కోట్ల నెట్, 9వ రోజు రూ.2.9 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ వసూళ్లతో మలయాళ చిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా రూ.100 కోట్లు + వరల్డ్ వైడ్ థియేట్రికల్ షేర్ అందుకున్న తొలి మలయాళ సినిమాగా నిలిచింది.

ఓవర్సీస్‌లో కలెక్షన్స్ (Overseas Collections)

ఓవర్సీస్‌లోనూ ఎల్ 2 : ఎంపురాన్‌కు మంచి ఆదరణ దక్కుతోంది. అన్ని దేశాల్లోనూ ఎక్సలెంట్ బుకింగ్స్‌తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఓవర్సీస్‌లో రూ.135 కోట్ల గ్రాస్‌‌ రాబట్టగా ఇండియాలో రూ.91.25 కోట్ల నెట్.. రూ.103.25 కోట్ల గ్రాస్‌ అందుకుంది ఎంపురాన్. మొత్తంగా 9 రోజుల వరకు 236.25 కోట్ల గ్రాస్ వసూళ్లను ఎంపురాన్ రాబట్టింది.

10వ రోజు కలెక్షన్స్ (L2: Empuraan Day 10 Collections)

వీకెండ్ కలిసి రావడంతో 10వ రోజైన శనివారం ఎల్ 2 : ఎంపురాన్ చిత్రం మంచి ఆక్యూపెన్సీని అందుకుంది. ఓవరాల్‌గా 27.61 శాతం ఆక్యూపెన్సీని నమోదు చేసిన మోహన్ లాల్ చిత్రం 10వ రోజున ఇండియాలో రూ.3.50 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ఇందులో మలయాళం నుంచి రూ.3.14 కోట్లు, కన్నడ నుంచి లక్ష రూపాయలు, తెలుగులో రూ.5 లక్షలు, తమిళంలో రూ.31 లక్షలు, హిందీలో రూ.7 లక్షల నెట్ కలెక్షన్స్‌ను సాధించింది. మొత్తంగా 10 రోజుల వరకు ఎల్ 2 : ఎంపురాన్ ఇండియాలో నికరంగా రూ.94.67 కోట్ల నెట్ , రూ.106.65 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ.135 కోట్లు + ఇండియాలో వచ్చిన గ్రాస్ కలిపి ప్రపంచవ్యాప్తంగా ఎల్ 2: ఎంపురాన్ 10 రోజుల్లో రూ.241.65 కోట్ల కలెక్షన్స్‌ను సాధించినట్లు సాక్ నిల్క్ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X