L2: Empuraan day 11 Collection : ఎంపురాన్ 11వ రోజు కలెక్షన్లు.. మోహన్ లాల్ సంచలనం.. ఎన్ని కోట్లంటే?
మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం ఎల్ 2: ఎంపురాన్. మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్, స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్ లో తెరకెక్కింది. రెండేళ్ల క్రితం వచ్చిన లూసిఫర్‌కు ఇది సీక్వెల్. ఈ చిత్రం రంజాన్ కానుకగా మార్చి 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి రోజే హిట్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ప్రస్తుతం రెండో వారంలోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లపై గోకుళం గోపాలం, ఆంటోనీ పెరుంబవూర్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఎల్ 2 : ఎంపురాన్ బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? గత 11 రోజులుగా ఈ సినిమా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఎల్ 2 : ఎంపురాన్ బడ్జెట్ ఎంత ( L2: Empuraan Budget)?
మలయాళ చిత్రం లూసిఫర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేవారు. దీనికి తగినట్లుగానే హై స్టాండర్డ్స్ ను మెయింటేయిన్ చేయడం కోసం ఎల్ 2 : ఎంపురాన్‌కు భారీగానే ఖర్చు చేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా ఎల్ 2 : ఎంపురాన్‌కు దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ అయ్యిందని మలయాళ ఇండస్ట్రీ టాక్.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత (L2: Empuraan Break Even Target)?
గతంలో మలయాళ చిత్ర పరిశ్రమలో ఏ సినిమాకు లేనంతగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇండియాలో రూ.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.30 కోట్ల చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం. ఇక ఎల్ 2 : ఎంపురాన్ లాభాల్లోకి రావాలంటే రూ.110 కోట్ల షేర్ .. రూ. 220 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.
గత 10 రోజుల కలెక్షన్స్ ( L2: Empuraan 10 days collections)
ఓపెనింగ్ డే నుంచే ఎల్ 2 : ఎంపురాన్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా వసూళ్ల విషయంలో సరికొత్త రికార్డులు నమోదు చేసింది. అడ్వాన్స్ బుకింగ్‌తో రూ.60 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. రిలీజ్ రోజున రూ.22 కోట్లతో కలిపి ఈ సినిమా ఫస్ట్ డే రూ.82 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి మలయాళ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. రెండో రోజూ రూ. 17 కోట్లు అందుకుని కేవలం 48 గంటల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించింది.
ఇక 3వ రోజు రూ.13.25 కోట్ల నెట్, 4వ రోజు రూ.13.65 కోట్ల నెట్, 5వ రోజు రూ.11.15 కోట్ల నెట్, 6వ రోజు రూ.8.55 కోట్ల నెట్, 7వ రోజు రూ.5.65 కోట్ల నెట్ అందుకుంది. తొలి వారంలో 88.25 కోట్ల నెట్ సాధించింది. ఇందులో మలయాళం నుంచి రూ.80.7 కోట్లు నెట్, కర్ణాటకలో రూ.23 లక్షల నెట్, తెలుగులో రూ.2.37 కోట్ల నెట్, తమిళనాడులో రూ.2.89 కోట్ల నెట్, హిందీలో రూ. 2.06 కోట్ల నెట్ సాధించినట్లు సాక్ నిక్ తెలిపింది. 2వ వారం 8వ రోజు రూ.3.9 కోట్ల నెట్, 9వ రోజు రూ.2.9 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. 10వ రోజు 3.35 కోట్ల ఇండియా నెట్ అదుందుకుంది. ఈ వసూళ్లతో మలయాళ చిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా రూ.100 కోట్లు + వరల్డ్ వైడ్ థియేట్రికల్ షేర్ అందుకున్న తొలి మలయాళ సినిమాగా నిలిచింది.
ఓవర్సీస్‌లో కలెక్షన్స్ (Overseas Collections)
ఓవర్సీస్‌లోనూ ఎల్ 2 : ఎంపురాన్‌కు మంచి ఆదరణ దక్కుతోంది. అన్ని దేశాల్లోనూ ఎక్సలెంట్ బుకింగ్స్‌తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఓవర్సీస్‌లో రూ.137 కోట్ల గ్రాస్ రాబట్టగా ఇండియాలో రూ.98.47 కోట్ల నెట్.. రూ.110.5 కోట్ల గ్రాస్ అందుకుంది ఎంపురాన్. మొత్తంగా 11 రోజుల వరకు 247.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూల్ చేసింది.
11వ రోజు కలెక్షన్స్ (L2: Empuraan day 11 Collections)
శుక్ర, శని, ఆదివారం వీకెండ్ కలిసి రావడంతో 11వ రోజు ఎల్ 2 : ఎంపురాన్ చిత్రానికి మంచి ఆక్యూపెన్సీని దక్కింది. 11వ రోజు ఓవరాల్‌గా 33.12 శాతం ఆక్యూపెన్సీని మలయాళంలో నమోదు చేసింది. ఇక 11వ రోజున ఇండియాలో రూ.3.85 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ఇందులో మలయాళం నుంచి రూ.3.58 కోట్లు నెట్ల అందుకుంది. కన్నడలో వసూళ్లు పెద్దగా లేవు. తెలుగులోనూ డ్రాప్ అయ్యింది. ఇక తమిళంలో రూ.30 లక్షలు, హిందీలో రూ.9 లక్షల నెట్ కలెక్షన్స్‌ను అందుకుంది. దీంతో 11వ రోజు వరకు ఎంపురాన్ చిత్రం వరల్డ్ వైడ్ గా 247.5 కోట్ల గ్రాస్ ను అందుకుంది. ఇండియా నెట్ రూ.98.47 కోట్లు, ఇండియా గ్రాస్ రూ.110.5 కోట్లు, ఓవర్సీస్ లో రూ.137 కోట్లు వసూళ్లు సాధించినట్లు సాక్ నిల్క్ తెలిపింది.


Click it and Unblock the Notifications











