L2: Empuraan day 12 Collection : ఎంపురాన్ 12 రోజుల కలెక్షన్లు.. బాక్సాఫీస్ వద్ద మోతమోగిస్తున్న మోహన్ లాల్

మలయాళ నటుడు మోహన్ లాల్ లేటెస్ట్ ఫిల్మ్ ఎల్2 : ఎంపురాన్. 'సలార్' నటుడు, మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రమిది. రెండేళ్ల కింద వచ్చిన లూసిఫర్‌కు ఇది సీక్వెల్‌. ఈ చిత్రం రంజాన్ కానుకగా మార్చి 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి రోజే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం 2వ వారంలో బాక్సాఫీస్ వసూళ్లను రాబడుతోంది. శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లపై గోకుళం గోపాలం, ఆంటోనీ పెరుంబవూర్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఎల్ 2 : ఎంపురాన్ బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? గత 11 రోజులుగా ఈ సినిమా సాధించిన కలెక్షన్లు ఎంతనే వివరాల్లోకి వెళితే..

ఎల్ 2 : ఎంపురాన్ బడ్జెట్ ఎంత ( L2: Empuraan Budget)?
లూసిఫర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఎల్2 : ఎంపురాన్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్టుగానే హై స్టాండర్డ్స్ ను మెయింటేయిన్ చేశారు. దాంతో ఈ చిత్రానికి భారీగానే ఖర్చు చేయాల్సి వచ్చింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా ఎల్ 2 : ఎంపురాన్‌కు రూ.150 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని మలయాళ ఇండస్ట్రీ టాక్.

L2 Empuraan day 12 Collection

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత (L2: Empuraan Break Even Target)?

మలయాళ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఏ సినిమాకు లేనంతగా ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇండియాలో రూ.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.30 కోట్ల చొప్పున, వరల్డ్ వైడ్ మొత్తంగా రూ. 100 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దీంతో ఎల్ 2 : ఎంపురాన్ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.110 కోట్ల షేర్ .. రూ. 220 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఇప్పటి వరకైతే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెన్ ను పూర్తి చేసుకుని లాభాల బాటలో పయనిస్తోంది.

గత 11 రోజుల కలెక్షన్స్ ( L2: Empuraan 11 days collections)

ఇక ఎల్ 2 : ఎంపురాన్ ఓపెనింగ్ డేనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత రెండు రోజులకు నెగెటివ్ టాక్ వచ్చినా వసూళ్ల విషయంలో అదరగొట్టింది. మలయాళ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదు చేసింది. అడ్వాన్స్ బుకింగ్‌తో రూ.60 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించగా, రిలీజ్ రోజున రూ.22 కోట్లతో కలిపి ఈ సినిమా ఫస్ట్ డే రూ.82 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. మలయాళ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే ఫస్ట్ డే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. ఇక 2వ రోజూ రూ. 17 కోట్లు అందుకుని కేవలం 48 గంటల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనంగా మారింది.

3వ రోజు రూ.13.25 కోట్ల నెట్, 4వ రోజు రూ.13.65 కోట్ల నెట్, 5వ రోజు రూ.11.15 కోట్ల నెట్, 6వ రోజు రూ.8.55 కోట్ల నెట్, 7వ రోజు రూ.5.65 కోట్ల నెట్ అందుకుంది. 8వ రోజు రూ.3.9 కోట్ల నెట్, 9వ రోజు రూ.2.9 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. 10వ రోజు 3.35 కోట్ల ఇండియా నెట్ అదుందుకుంది. 11వ రోజు రూ.3.85 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. అయితే ఫస్ట్ వీక్ పూర్తయ్యే సరికి రూ.88.25 కోట్ల ఇండియా నెట్ సాధించింది. ఇందులో మలయాళం నుంచి రూ.80.7 కోట్లు నెట్, కర్ణాటకలో రూ.23 లక్షల నెట్, తెలుగులో రూ.2.37 కోట్ల నెట్, తమిళనాడులో రూ.2.89 కోట్ల నెట్, హిందీలో రూ. 2.06 కోట్ల నెట్ సాధించినట్లు సాక్ నిల్క్ రిపోర్ట్ లో తెలిపింది.

ఓవర్సీస్‌లో కలెక్షన్స్ (Overseas Collections)

ఓవర్సీస్‌లోనూ ఎల్ 2 : ఎంపురాన్‌కు మంచి ఆదరణ దక్కుతోంది. అన్ని దేశాల్లోనూ ఎక్సలెంట్ బుకింగ్స్‌తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 10వ రోజు వరకు ఓవర్సీస్‌లో రూ.137 కోట్ల గ్రాస్‌‌ రాబట్టి అక్కడా సంచనలంగా మారింది. 11 రోజుల్లో ఓవర్సీస్ లో టోటల్ గా రూ.138 కోట్ల వరకు గ్రాస్ పెరిగింది. ఇక ఈ వసూళ్లతో మలయాళ చిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా రూ.100 కోట్లు + వరల్డ్ వైడ్ థియేట్రికల్ షేర్ అందుకున్న తొలి మలయాళ సినిమాగా నిలిచింది.

12వ రోజు కలెక్షన్స్ (L2: Empuraan day 12 Collections)

ఎల్2 : ఎంపురాన్ కు 2వ వీకెండ్ కూడా మంచి వసూళ్లను అందిస్తోంది. 3 నుంచి 4 కోట్ల మధ్య వసూళ్లు రాబడుతూ ఆశ్చర్యపరుస్తోంది. ఇక 12వ రోజుకు సంబంధించిన కలెక్షన్లు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. 12వ రోజు సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ 16.30 శాతం థియేటర్ ఆక్యుపెన్సీని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ. 2 కోట్ల ఇండియా నెట్ అందుకుందీ చిత్రం. మలయాళంలో రూ.1.49 కోట్ల నెట్, తమిళంలో రూ.7 లక్షలు, తెలుగు, హిందీ, కన్నడలో మొత్తం కలిసి రూ.30 లక్షల వరకు నెట్ రాబట్టినట్టు తెలుస్తోంది. దీంతో 12 రోజుల్లో ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.253 కోట్ల గ్రాస్, 99.91 కోట్ల నెట్, రూ.115 కోట్ల ఇండియా గ్రాస్, రూ.138 కోట్ల వరకు ఓవర్సీస్ కలెక్షన్లు అందుకుందని సాక్ నిల్క్ తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X