L2: Empuraan day 13 Collection : ఎంపురాన్ 13 రోజుల కలెక్షన్లు.. వామ్మో మోహన్ లాలా మజాకా.. ఎన్నికోట్లంటే?

మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్ ఎల్2 : ఎంపురాన్ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. 2వ వారం పూర్తి చేసుకోబోతున్నా వసూళ్ల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. 'సలార్' నటుడు, మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రమిది కావడం విశేషం. రెండేళ్ల కింద వచ్చిన లూసిఫర్‌కు ఇది సీక్వెల్‌. ఈ చిత్రం రంజాన్ కానుకగా మార్చి 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి రోజే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లపై గోకుళం గోపాలం, ఆంటోనీ పెరుంబవూర్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఎల్ 2 : ఎంపురాన్ బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? గత 13 రోజులుగా ఈ సినిమా సాధించిన కలెక్షన్లు ఎంతనే వివరాల్లోకి వెళ్లితే..

ఎల్ 2 : ఎంపురాన్ బడ్జెట్ ఎంత ( L2: Empuraan Budget)?

ఎల్2 : ఎంపురాన్ సినిమాను లూసిఫర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కించారు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్టుగానే హై స్టాండర్డ్స్ ను మెయింటేయిన్ చేశారు. దాంతో ఈ చిత్రానికి భారీగానే ఖర్చు చేయాల్సి చేశారు. స్టార్ కాస్ట్, స్కిల్డ్ టెక్నీషియన్ల రెమ్యూనరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా ఎల్ 2 : ఎంపురాన్‌కు రూ.150 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని మలయాళ ఇండస్ట్రీ టాక్.

L2 Empuraan day 13 Collection

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత (L2: Empuraan Break Even Target)?

ఇప్పటి వరకు మలయాళ చిత్ర పరిశ్రమలో ఏ సినిమాకు లేనంతగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇండియాలో రూ.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.30 కోట్లు కలిపి వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం. దీంతో ఎల్ 2 : ఎంపురాన్ చిత్రం లాభాల్లోకి రావాలంటే రూ.110 కోట్ల షేర్ .. రూ. 220 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. ఇప్పటి వరకైతే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కంప్లీట్ చేసింది. లాభాల బాటలో పయనిస్తోంది.

గత 12 రోజుల కలెక్షన్స్ ( L2: Empuraan 11 days collections)

ఎల్ 2 : ఎంపురాన్ ఓపెనింగ్ డే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ తర్వాతి రెండ్రోజులకు వివాదంలో చిక్కుకుంది. అయినా కూడా వసూళ్ల విషయంలో అదరగొడుతోంది. ఇప్పటికే 250 కోట్ల గ్రాస్ దాటేసిందీ చిత్రం. అడ్వాన్స్ బుకింగ్‌తో రూ.60 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించగా, రిలీజ్ రోజున రూ.22 కోట్లతో కలిపి ఈ సినిమా ఫస్ట్ డే రూ.82 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టింది. మలయాళ చిత్ర పరిశ్రమ చరిత్రలోనే ఫస్ట్ డే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. ఇక 2వ రోజూ రూ. 17 కోట్లు అందుకుని కేవలం 48 గంటల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనంగా మారింది. 3వ రోజు రూ.13.25 కోట్ల నెట్, 4వ రోజు రూ.13.65 కోట్ల నెట్, 5వ రోజు రూ.11.15 కోట్ల నెట్, 6వ రోజు రూ.8.55 కోట్ల నెట్, 7వ రోజు రూ.5.65 కోట్ల నెట్ అందుకుంది. 8వ రోజు రూ.3.9 కోట్ల నెట్, 9వ రోజు రూ.2.9 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. 10వ రోజు 3.35 కోట్ల ఇండియా నెట్ అదుందుకుంది. 11వ రోజు రూ.3.85 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. 12వ రోజు రూ.1.55 కోట్లు నెట్ అందుకుంది. మలయాళంలో రూ.1.4 కోట్ల నెట్, తెలుగులో రూ.2 లక్షలు, తమిళంలో రూ.లక్ష, హిందీలో రూ.3 లక్షలు అందుకుంది.

ఓవర్సీస్‌లో కలెక్షన్స్ (Overseas Collections)

ఓవర్సీస్‌లోనూ ఎల్ 2 : ఎంపురాన్‌కు మంచి ఆదరణ దక్కుతోంది. అన్ని దేశాల్లోనూ ఎక్సలెంట్ బుకింగ్స్‌తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 13వ రోజు వరకు ఓవర్సీస్‌లో రూ.140.2 కోట్ల గ్రాస్‌‌ రాబట్టింది. ఓవర్సీస్ వద్ద కూడా ఈ చిత్రం భారీగా వసూళ్లును అందుకొని సంచలనంగా మారింది. ఈ వసూళ్లతో మలయాళ చిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా రూ.100 కోట్లు + వరల్డ్ వైడ్ థియేట్రికల్ షేర్ అందుకున్న తొలి మలయాళ సినిమాగా నిలిచింది.

13వ రోజు కలెక్షన్స్ (L2: Empuraan day 13 Collections)

ఎల్2 : ఎంపురాన్ కు 2వ వీకెండ్ కూడా మంచి వసూళ్లను అందుకుంటోంది. 13వ రోజుకు సంబంధించిన కలెక్షన్లు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. 13వ రోజు మంగళవారం వర్కింగ్ డే అయినప్పటికీ రూ.1.25 కోట్ల వరకు ఇండియా నెట్ అందుకుంది. 15.32 శాతం థియేటర్ ఆక్యుపెన్సీని అందుకుంది. 13వ రోజు మలయాళంలో రూ.1.13 కోట్ల నెట్, తమిళంలో రూ.10 లక్షలు అందుకుంది. తెలుగు, హిందీ, కన్నడలో కలిసి రూ.2 లక్షలు మాత్రమే వసూళ్లు చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో 13 రోజుల్లో ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.257 కోట్ల గ్రాస్, ఇండియా నెట్ రూ.101.13 కోట్ల నెట్, రూ.116.8 కోట్ల ఇండియా గ్రాస్ అందుకుంది. ఓవర్సీస్ లో రూ.140.2 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసింది. థర్డ్ వీక్ లో ఈ చిత్రం రూ.300 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X