L2: Empuraan Day 5 Collections: 250 కోట్లకు చేరువైన ఎంపురాన్.. మోహన్ లాల్ మూవీ సరికొత్త చరిత్ర
సౌత్ సూపర్ స్టార్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం L2: ఎంపురాన్. ఈ చిత్రంలో మంజు వారియర్, టొవినో థామస్, అభిమన్యు సింగ్, సాయికుమార్, సూరాజ్ వెంజరాముడు, ఫాజిల్, సచిన్ ఖేడ్కర్, సానియా అయ్యప్పన్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ తదితరులు నటించారు. ఆంటోని పెరుంబవూర్, గోకుళం గోపాలన్ నిర్మించిన ఈ చిత్రానికి సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫి, అఖిలేష్ మోహన్ ఎడిటింగ్, దీపక్ దేవ్ మ్యూజిక్ అందించారు.
మలయాళంలో తొలి పాన్ ఇండియా మూవీగా రూపొందిన L2: ఎంపురాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో జైత్రయాత్రను ప్రారంభించింది. లూసిఫర్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లోనే వసూళ్ల పరంగా సత్తా చాటుతున్నది. ఈ సినిమా కేరళ సినీ రంగంలో సరికొత్త చరిత్రను రాసేందుకు సిద్దమవుతున్నది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వసూలు చేస్తున్న కలెక్షన్ల వివరాలు ఏమిటి అనే విశేషాల్లోకి వెళితే..

లూసిఫర్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందించిన ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించారు. లూసిఫర్ 2 సినిమాను మలయాళ సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా పలు దేశాల్లో యాక్షన్ సీన్లను షూట్ చేవారు. ఈ చిత్రానికి టాప్ లెవెల్ టెక్నిషియన్స్, హాలీవుడ్ నటీనటులు వర్క్ చేయడంతో బడ్జెట్ పరంగా అధికంగానే అయిందని నిర్మాత దిల్ రాజు ఇటీవల హైదరాబాద్‌లో వెల్లడించారు. ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 150 కోట్ల రూపాయలు, కేరళలో తొలి భారీ బడ్జెట్ చిత్రమని ఆయన వెల్లడించారు.
పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ జైత్రయాత్రను ప్రారంభించిన ఎంపురాన్ తొలి వారాంతంలోనే చరిత్ర సృష్టించింది. గతంలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడుకాలమ్ వసూలు చేసిన 64.20 కోట్ల వసూళ్ల రికార్డును తిరగరాసింది. ఈ చిత్రం నాలుగు రోజుల్లో 170 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మలయాళ సినిమా రంగంలో ఇదే అత్యుత్తమ రికార్డు అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఎంపురాన్ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్‌లో భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ సినిమా గల్ఫ్ కంట్రీస్‌లో లూసిఫర్ చిత్రం 5.72 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అయితే సుదీర్గకాలంగా ఉన్న రికార్డును ఎంపురాన్ చిత్రం అధిగమించింది. ఈ సినిమా కేవలం నాలుగు రోజుల్లోనే 6.59 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.
గత నాలుగు రోజులుగా ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా కేరళలో 43 కోట్ల రూపాయలు, మిగితా రాష్ట్రాల్లో 25 కోట్ల రూపాయలు రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా ఇప్పటి వరకు నార్త్ అమెరికా, యూకే, గల్ఫ్ కంట్రీస్, ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో సుమారుగా 13 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే సుమారుగా 108 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది.
ఎంపురాన్ సినిమాకు 5వ రోజు కూడా సెలవు దినంగా కలిసి వచ్చింది. రంజాన్ పండుగ హాలీడే కావడంతో ఈ సినిమాకు ఆక్యుపెన్సీ పెరిగింది. దాంతో ఈ సినిమా ఇండియాలో సుమారుగా 12 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది అని సాక్ నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది. ఇక ఈ సినిమా ఓవర్సీస్‌లో కలుపుకొని సుమారుగా 28 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











