L2: Empuraan day 9 Collection: ఆ క్లబ్‌లోకి ఎంపురాన్.. తొలి మలయాళ హీరోగా మోహన్‌లాల్ , ఎల్ 2కి ఎన్ని కోట్లంటే?

మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ , స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో తెరకెక్కిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా వచ్చిన చిత్రమే ఎల్ 2: ఎంపురాన్. రంజాన్ కానుకగా మార్చి 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంచనాలను నిజం చేస్తూ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. శ్రీ గోకుళమ్ మూవీస్, ఆశీర్వాద్ సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ సినిమాను గోకుళం గోపాలం, ఆంటోనీ పెరుంబవూర్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఎల్ 2 : ఎంపురాన్ బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? గత 9 రోజులుగా ఈ సినిమా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే :

L2 Empuraan day 9 Collection Mohanlal s L2 becomes first Malayalam Movie to enter the 100 crore share club

ఎల్ 2 : ఎంపురాన్ బడ్జెట్ ఎంత ( L2: Empuraan Budget)?

లూసిఫర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావించారు. దీనికి తగినట్లుగానే హై స్టాండర్డ్స్ రావడం కోసం ఎల్ 2 : ఎంపురాన్‌కు భారీగానే ఖర్చు చేశారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాల కారణంగా ఎల్ 2 : ఎంపురాన్‌కు దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ అయ్యిందని మలయాళ ఇండస్ట్రీ టాక్.

బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత (L2: Empuraan Break Even Target)?

మలయాళ చిత్ర పరిశ్రమలోనే ఎన్నడూ లేనివిధంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇండియాలో రూ.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.30 కోట్ల చొప్పున మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇండియాలో రూ.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.30 కోట్ల వ్యాపారం జరిగింది. ఎల్ 2 : ఎంపురాన్ లాభాల్లోకి రావాలంటే రూ.110 కోట్ల షేర్ .. రూ. 220 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు.

గత 8 రోజుల కలెక్షన్స్ ( L2: Empuraan 8 days collections)

మార్నింగ్ షో నుంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఎల్ 2 : ఎంపురాన్.. వసూళ్ల విషయంలో కొత్త లెక్కలు సెట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్‌తో రూ.60 కోట్లు , మార్చి 27న రిలీజ్ రోజున రూ.22 కోట్లతో కలిపి ఈ సినిమా తొలి రోజు రూ.82 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి మలయాళ చిత్ర పరిశ్రమలోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. రెండో రోజూ రూ. 17 కోట్లు రాబట్టి కేవలం 48 గంటల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది.

మూడో రోజు రూ.13.25 కోట్ల నెట్, నాలుగో రోజు రూ.13.65 కోట్ల నెట్, ఐదో రోజు రూ.11.15 కోట్ల నెట్, ఆరో రోజు రూ.8.55 కోట్ల నెట్, ఏడో రోజు రూ.5.65 కోట్ల నెట్, ఎనిమిదవ రోజు రూ.3.9 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక తొలి వారంలో 88.25 కోట్ల నెట్ సాధించింది ఎంపురాన్ . ఇందులో మలయాళం నుంచి రూ.80.7 కోట్లు నెట్, కర్ణాటకలో రూ.23 లక్షల నెట్, తెలుగులో రూ.2.37 కోట్ల నెట్, తమిళనాడులో రూ.2.89 కోట్ల నెట్, హిందీలో రూ. 2.06 కోట్ల నెట్ సాధించినట్లు సాక్ నిక్ తెలిపింది.

ఓవర్సీస్‌లో కలెక్షన్స్ (Overseas Collections)

ఓవర్సీస్‌లోనూ మోహన్ లాల్ చిత్రం దుమ్మురేపుతోంది. అన్ని దేశాల్లోనూ సాలీడ్ బుకింగ్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఓవర్సీస్‌లో రూ.133 కోట్ల గ్రాస్‌‌ రాబట్టగా ఇండియాలో రూ.91.15 కోట్ల నెట్.. రూ.103.25 కోట్ల గ్రాస్‌ అందుకుంది ఎంపురాన్. మొత్తంగా 236.25 కోట్ల గ్రాస్ వసూళ్లను మోహన్ లాల్ చిత్రం రాబట్టింది.

9వ రోజు కలెక్షన్స్ (L2: Empuraan Day 9 Collections)

9వ రోజైన శుక్రవారం ఎల్ 2 : ఎంపురాన్ చిత్రం మంచి ఆక్యూపెన్సీని అందుకుంది. ఓవరాల్‌గా 12.42 శాతం ఆక్యూపెన్సీని నమోదు చేసిన మోహన్ లాల్ చిత్రం 9వ రోజున ఇండియాలో రూ.3 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. ఇందులో మలయాళం నుంచి రూ.2.57 కోట్లు, కన్నడ నుంచి రూ.2 లక్షలు, తెలుగులో రూ.5 లక్షలు, తమిళంలో రూ.24 లక్షలు, హిందీలో రూ.4 లక్షల నెట్ కలెక్షన్స్‌ను సాధించింది. మొత్తంగా 9 రోజుల వరకు ఎల్ 2 : ఎంపురాన్ ఇండియాలో నికరంగా రూ.91.25 కోట్ల వసూళ్లను సాధించినట్లు సాక్ నిల్క్ తెలిపింది.

అంతేకాదు.. 9వ రోజు కలెక్షన్స్‌తో కలిపి ఎల్ 2 : ఎంపురాన్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో తొలిసారిగా రూ. 100 కోట్లు + వరల్డ్ వైడ్ థియేట్రికల్ షేర్ అందుకున్న మొదటి చిత్రంగా ఎల్ 2 : ఎంపురాన్ నిలిచింది. ఈ విషయాన్ని హీరో మోహన్ లాల్ అధికారికంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వీకెండ్ మొదలు కావడంతో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందోనని ట్రేడ్ పండితులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Read more about: mohan lal prithviraj sukumaran
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X