L2E: Empuraan Box Office: ఎంపురాన్ బాక్సాఫీస్ ఊచకోత.. రిలీజ్‌కు ముందే మోహన్‌లాల్ మూవీ సంచలనం.. ఎన్ని కోట్లంటే?
సౌత్ సూపర్ స్టార్ మోహన్ లాల్, స్టార్ హీరో డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం L2E: ఎంపురాన్. ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్, మణికుట్టన్, మణికుట్టన్ నటించారు. ఈ సినిమా మార్చి 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో ఇటీవల మొదలైన అడ్వాన్స్ బుకింగ్ సునామీని తలపిస్తున్నది. ఈ సినిమా ప్రీ సేల్స్ బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
మలయాళ చిత్రసీమలోనే అత్యంత భారీ చిత్రంగా 'L2E: ఎంపురాన్' చిత్రాన్ని పృథ్వీరాజ్ సుకుమారన్ నిర్మించారు. ఈ మూవీని అమెరికా, దుబాయ్, యూకే లాంటి దేశాల్లో చిత్రీకరించారు. ఇంతకుమున్నెడూ లేని విధంగా యాక్షన్ ఎపిసోడ్స్, నేచురల్‌గా బాంబ్ బ్లాస్ట్‌లతో సినిమాను పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. మలయాళ చిత్రసీమ నుంచి ఐమ్యాక్స్‌లో రిలీజ్ అవుతున్న తొలి చిత్రంగా 'L2E: ఎంపురాన్' ప్రపంచ ప్రేక్షకులను మెప్పించనుండటం విశేషం.

ఎంపురాన్ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని దిల్‌రాజుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ విడుదల చేస్తుండగా హిందీలో అనీల్ తడానీకి చెందిన ఏఏ ఫిల్మ్స్ నార్త్ ఇండియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది. కర్ణాటకలో ప్రముఖ సంస్థ హోంబలే ఫిల్మ్స్ రిలీజ్ చేస్తున్నది. తమిళనాడులో గోకులం గోపాలన్ కి చెందిన శ్రీ గోకులం మూవీస్ ద్వారా విడుదల కానున్నది.
లూసిఫర్ సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమా వ్యయం సుమారుగా 150 కోట్ల రూపాయలు అయింది. కేరళ సినీ పరిశ్రమలో ఈ రేంజ్ బడ్జెట్‌తో రూపొందించడం ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఇక ఇటీవల మొదలైన అడ్వాన్స్ బుకింగ్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. ఓవర్సీస్, కేరళ, తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు, కన్నడ పరిశ్రమలో రికార్డు ఒపెనింగ్స్ మొదలవుతున్నాయి.
ఎంపురాన్ సినిమా ప్రీ సేల్స్ విషయానికి వస్తే.. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్‌కు 37 కోట్ల రూపాయలు, వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు 55 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. ఈ అడ్వాన్స్ బుకింగ్ సుమారుగా 60 కోట్ల రూపాయలకుపైగానే ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఈ మూవీ సుమారుగా 300 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు అంచనా వేశారు.
మార్చి 27వ తేదీన రిలీజ్ అవుతున్న విక్రమ్ సినిమా వీర ధీర శూర సినిమా కంటే భారీగా తమిళనాడులో వసూళ్లు సాధిస్తున్నది. ఇక కేరళలో సూపర్ స్టార్ విజయ్ నటించిన లియో సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లను ఎంపురాన్ అధిగమించింది. లియో 8.81 కోట్లు వసూలు చేస్తే.. లూసిఫర్ 2 9.5 కోట్ల వసూలు చేసింది. రిలీజ్‌కు ఇంకా కొన్ని రోజులు ఉన్నందున్న ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











