L2E: Empuraan Pre Sales Collections: L2E: ఎంపురాన్ కలెక్షన్ల సునామీ.. రిలీజ్‌కు ముందే మోహన్‌లాల్ రికార్డు
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, స్టార్ యాక్టర్, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం L2E: ఎంపురాన్. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్, మణికుట్టన్, మణికుట్టన్ ఉన్నారు. ఓ'నెల్, ఎరిక్ ఎబౌనీ, మిఖాయిల్ నోవికోవ్, కార్తికేయ దేవ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు.
మలయాళ చిత్రసీమలోనే అత్యంత భారీ చిత్రంగా 'L2E: ఎంపురాన్' చిత్రాన్ని ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. ఓవర్సీస్‌లో ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన లభిస్తున్నది. ఈ సినిమా ప్రీ రిలీజ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫర్‌కు సీక్వెల్‌గా రూపొందిన L2E: ఎంపురాన్ చిత్రం ఓవర్సీస్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయాయి. ఏ మలయాళ సినిమా చేయని విధంగా ఓవర్సీస్ మార్కెట్‌లో బిజినెస్ చేసింది. అలాగే ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్‌ను సుమారుగా 30 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఓవర్సీస్ మార్కెట్‌లో అత్యధిక రేటుకు అమ్ముడుపోయిన చిత్రాల్లో ఒకటిగా ఎంపురాన్ నిలిచింది.
మోహన్ లాల్ కెరీర్‌లో ఇంతకుముందెన్నడూ లేని విధంగా ఎంపురాన్ మూవీ అడ్వాన్స్ బుకింగ్ సేల్స్‌కు అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, గల్ఫ్ కంట్రీస్‌తోపాటు ఇతర దేశాల్లో భారీగా ప్రీ సేల్స్ జరుగుతున్నది. ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. ఈ సినిమా ప్రీమియర్లకు ఇంకా వారం రోజులు ఉండగానే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ ఛాయలు కనిపిస్తున్నాయి.
ఉత్తర అమెరికా అంటే.. అమెరికా, కెనడాలో ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ సినిమా ఇప్పటికే 150K డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 1.30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గతంలో పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన అడు జీవితం సినిమా తొలి రోజు 115K డాలర్లు మాత్రమే వసూలు చేసింది. ఇంకా వారం రోజులు ఉండగానే ఈ సినిమా ఆ చిత్రం కలెక్షన్లను ప్రీ సేల్స్ ద్వారా అధిగమించింది.
ఎంపురాన్ సినిమా ప్రీ సేల్స్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం మలయాళ చిత్రసీమలో రికార్డు క్రియేట్ చేసింది. కేరళలో బుకింగ్స్ ఓపెన్ కాకుండానే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 9 కోట్ల రూపాయలు రాబట్టింది. అమెరికా, కెనడా, జర్మనీ, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో రికార్డు వసూళ్లు నమోదు చేస్తున్నది.


Click it and Unblock the Notifications











