Just In
- 1 hr ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్‌లో సినీ పరిశ్రమ!
- 1 hr ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- 1 hr ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్‌గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 2 hrs ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- Sports
స్మిత్‌ను ఎందుకు వదిలేశారు?.. వార్నర్ కన్నా స్టీవ్ పెద్ద నేరస్థుడు: ఇయాన్ చాపెల్
- Automobiles
ఒక ఛార్జ్‌తో 130 కి.మీ.. డ్రైవింగ్ లైసెన్స్ అవసరమే లేని కొత్త ఒకినవ స్కూటర్
- News
సుప్రీంకోర్టులో ఏపీ పంచాయతీ- సర్కారు అప్పీలు-ఎస్ఈసీ కేవియట్- తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'అల.. వైకుంఠపురములో' డే 3 కలెక్షన్స్: అల్లు అర్జున్ రాకింగ్.. పుంజుకున్న పందెం కోడి!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హంగామా రోజు రోజుకూ పుంజుకుంటోంది. 'అల.. వైకుంఠపురములో' రూపంలో వచ్చిన సంక్రాంతి పందెం కోడి ప్రతిరోజూ విజయం సాధిస్తోంది. దీంతో బన్నీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. విడుదలైన మొదటి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకున్న 'అల.. వైకుంఠపురములో' మూవీ విజయవంతంగా మూడో రోజు కూడా పూర్తిచేసుకుంది. ఈ మూడు రోజుల్లో కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దామా..

2020 సంవత్సరానికి ఘన స్వాగతం.. సంక్రాంతి విన్నర్
2020 సంవత్సరానికి ఘన స్వాగతం పలుకుతూ 'అల.. వైకుంఠపురములో' సినిమా రిలీజయ్యింది. ప్రీమియర్స్ ద్వారానే సక్సెస్ టాక్ రావడంతో బన్నీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. జనవరి 12న ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లు అర్జున్.. తొలిరోజే సంక్రాంతి విన్నర్ అని రుజువు చేశాడు.

డే బై డే.. సేమ్ స్పీడ్
తొలిరోజే కేవలం తెలుగు రాష్ట్రాల నుండి 25.56 కోట్ల షేర్ రాబట్టింది ‘అల.. వైకుంఠపురములో' మూవీ. రెండో రోజు కూడా అదే స్పీడు కంటిన్యూ చేస్తూ మరో 10 కోట్ల సుమారు వసూళ్లు రాబట్టింది. ఇక మూడో రోజు చూస్తే తెలుగు రాష్ట్రాల నుండి 9 నుంచి 11 కోట్లు వసూలైనట్లు రిపోర్ట్స్ అందాయి.

మూడో రోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తే..
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ మార్కెట్లో దుమ్ముదులుపుతోంది ‘అల.. వైకుంఠపురములో' మూవీ. సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది. మూడోరోజు మూడో రోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ రిపోర్ట్ చూస్తే 10 నుంచి 12 కోట్లు వచ్చాయని తెలుస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాలు, వరల్డ్ వైడ్ టోటల్ షేర్
ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ ప్రకారం మూడోరోజు ముగిసే సరికి తెలుగు రాష్ట్రాల్లో ‘అల.. వైకుంఠపురములో' మూవీ 40 నుంచి 42 కోట్ల షేర్ రాబట్టిందని తెలిసింది. అలాగే వరల్డ్ వైడ్ టోటల్ షేర్ 53 నుంచి 56 కోట్లు అని తెలిసింది.

బాక్సాఫీస్ దాడి.. కలిసొస్తున్న సంక్రాంతి
'అల.. వైకుంఠపురములో' మూవీ. సంక్రాతి విన్నర్‌గా నిలిచి భారీ రేంజ్ బాక్సాఫీస్ దాడి చేస్తోంది. సంక్రాంతి సెలవులు కావడంతో మరో వారం పాటు 'అల.. వైకుంఠపురములో' కలెక్షన్ల సునామీ ఇలాగే కొనసాగవచ్చని అంటున్నారు ట్రేడ్ పండితులు.

త్రివిక్రమ్- బన్నీ కాంబో
గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో 'అల.. వైకుంఠపురములో' మూవీ రూపొందింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. టబు, రాజేంద్రప్రసాద్, తనికెళ్ల భరణి సుశాంత్, నివేతా పేతురాజ్, సునీల్, బ్రహ్మాజీ, నవదీప్, సముద్రఖని ముఖ్యపాత్రల్లో నటించారు.