Laal Salam Closing Collections 50 ఏళ్ల కెరీర్‌లో రజనీకాంత్ ఊహించని డిజాస్టర్.. లాల్ సలామ్‌కు నష్టమెంత?
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో సుభాస్కరన్ నిర్మించిన లాల్ సలామ్ బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని నమోదు చేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్, క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ కీలక పాత్రలను పోషించారు. ఫిబ్రవరి 9వ తేదీన రిలీజైన ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
క్రికెట్ బ్యాక్ డ్రాప్‌గా, రెండు మతాల ఘర్షణ నేపథ్యంతో రూపొందిన లాల్ సలామ్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా లైకా రూపొందించింది. ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణల రెమ్యునరేషన్లతో కలిపి ఈ సినిమాను మొత్తంగా 701 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను 80 కోట్లతో పూర్తి చేశారు.

జైలర్ సినిమా తర్వాత ఈ మూవీ రావడంతో అభిమానుల నుంచి భారీ డిమాండ్ ఏర్పడింి. దాంతో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 1000 స్క్రీన్లకుపైగా రిలీజ్ చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 35 కోట్లకుపైగా జరిగింది. దాంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారుగా 37 కోట్ల రూపాయలతో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది.
లాల్ సలామ్ చిత్రం తొలి రోజు భారీగా కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం తొలి రోజున తమిళనాడులో 4 కోట్ల రూపాయల గ్రాస్, ఇండియా వ్యాప్తంగా 5 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇక రెండో రోజు కూడా ఈ సినిమా నిలకడగా బాక్సాఫీస్ వద్ద రాణించింది. తమిళనాడులో 3.5 కోట్లు, ఆంధ్రా, నైజాం, కర్ణాటక తదితర ప్రాంతాల్లో కలిపి 4.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 6.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.
లాల్ సలామ్ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు తగినట్గుగా లేకపోవడం వల్ల క్రమంగా వసూళ్లు తగ్గుతూ వచ్చింది. ఆదివారం ఈ సినిమా అంటే 4వ రోజు తమిళనాడులో 3.5 కోట్లు, ఇండియా వైడ్ 4 కోట్ల గ్రాస్ వసూళ్లు, ప్రపంచవ్యాప్తంగా 5.5 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇక 4వ రోజు 2.5 కోట్లు, 5వ రోజు 1.6 కోట్ల గ్రాస్, 6వ రోజు 1 కోటి గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది. 7వ రోజు ఈ సినిమా 1 కోటి రూాపయలు వసూలు చేసింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో లాల్ సలామ్ కలెక్షన్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ సినిమా తొలి రోజు ఆంధ్రా, నైజాంలో 30 లక్షల నికర వసూళ్లు, 2వ రోజు 25 లక్షలు, 3వ రోజు 25 లక్షలు, 4వ రోజు 30 లక్షలు, 5వ రోజు 25 లక్షలు, 6వ రోజు 15 లక్షలు, 7వ రోజు 10 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా తెలుగులో సుమారుగా 2 కోట్ల రూపాయల మేర వసూళ్లను రాబట్టింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా లాల్ సలామ్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి ెవళితే.. ఓవర్సీస్‌లో ఈ సినిమా 5 కోట్ల రూపాయలు, తమిళనాడులో 19 కోట్ల రూపాయల గ్రాస్, తెలుగులో 2 కోట్ల రూపాయలు, కన్నడలో 2 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా రజనీకాంత్ 50 ఏళ్ల కెరీర్‌లో అత్యంత దారుణంగా కలెక్షన్లను రాబట్టి.. అతిపెద్ద డిజాస్టర్‌గా మారింది.


Click it and Unblock the Notifications











