twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Laal Singh Chaddha day 1 collections షాకింగ్‌గా కలెక్షన్లు.. ఆ ఇద్దరు కుర్ర హీరోల కంటే అమీర్ ఖాన్‌కు తక్కువగా

    |

    బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా చిత్రం అనేక వివాదాలు, నిరసనల మధ్య ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే గతంలో మాదిరిగా అమీర్ ఖాన్ సినిమాలకు ఉన్నంత క్రేజ్ ఈ సినిమాకు కనిపించకపోవడం ట్రేడ్ వర్గాలను నివ్వెరపాటుకు గురిచేసింది. అయితే అమీర్ ఖాన్ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా అడ్వాన్స్ బుకింగ్, తొలి రోజు కలెక్షన్లు నమోదయ్యాయి. లాల్ సింగ్ చడ్డా చిత్రానికి సంబంధించి తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంతంటే?

    లాంగ్ వీకెండ్ కారణంగా

    లాంగ్ వీకెండ్ కారణంగా


    ఆగస్టు రెండో వారం లాంగ్ వీకెండ్ కావడంతో లాల్ సింగ్ చడ్డాకు బాగా కలిసి వచ్చే అంశంగా మారింది. ఆగస్టు 15వ తేదీ, 16వ తేదీ కూడా ఉత్తరాదిలో సెలవు దినంగా పాటిస్తుడటం కొంత పాజిటివ్‌గా మారే అవకాశం ఉంది. శుక్రవారం రక్షాబంధన్, శనివారం, ఆదివారం కూడా కలిసి వచ్చాయి. అయితే తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్‌కు స్పందన కనిపించలేదు. అయితే సెలవు దినాల్లో ఏదైనా పాజిటివ్‌గా మారుతందనే ఆశాభావంతో ట్రేడ్ వర్గాలు ఉన్నాయి.

    20 శాతం అక్యుపెన్సీతో

    20 శాతం అక్యుపెన్సీతో


    దేశవ్యాప్తంగా లాల్ సింగ్ చద్దా చిత్రం 20 శాతం అక్యుపెన్సీ నమోదైంది. ఈ చిత్రం ఢిల్లీ, దక్షిణాదిలో భారీ రెస్పాన్స్ కనిపిస్తున్నది. పంజాబ్, ముంబై, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో పాజిటివ్ ఓపెన్సింగ్ కనిపించాయి. అయితే ఈ సినిమా తొలి రోజు డబుల్ డిజిట్ దాటుతుందనే అభిప్రాయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

     ప్రపంచవ్యాప్తంగా 5 వేల స్క్రీన్లలో

    ప్రపంచవ్యాప్తంగా 5 వేల స్క్రీన్లలో


    లాల్ సింగ్ చడ్డా చిత్రం దేశవ్యాప్తంగా 9250 షోలు ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా 5 వేల స్క్రీన్లలో ఈ సినిమాను ప్రదర్శించారు. 12 శాతం మేర అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ 5.32 కోట్ల మేర నమోదైంది. పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్ లాంటి మల్టీప్లెక్స్‌లో దాదాపు 30 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. ఇక దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఈ చిత్రం 57 వేల టికెట్ల అమ్మకాలు జరిగాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    కార్తీక్ ఆర్యన్, వరుణ్ ధావన్ కంటే తక్కువగా

    కార్తీక్ ఆర్యన్, వరుణ్ ధావన్ కంటే తక్కువగా


    అయితే కార్తీక్ ఆర్యన్, వరుణ్ ధావన్ లాంటి యువ హీరోల కంటే అమీర్ ఖాన్ తక్కువగా బుకింగ్స్ నమోదయ్యాయి. కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భలయ్యా 2 చిత్రం, వరుణ్ ధావన్ నటించిన జుగ్ జుగ్ జీయో చిత్రం కంటే 50 శాతం బుకింగ్ తక్కువగా నమోదైంది. దేశవ్యాప్తంగా టాప్ మల్టీ‌ప్లెక్స్‌లో భూల్ భలయ్యా తొలి రోజు 1 లక్షకుపైగా టికెట్లు అమ్మితే.. జుగ్ జుగ్ జియో చిత్రం 57 వేలకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయి.

     తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంతంటే?

    తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంతంటే?

    దేశవ్యాప్తంగా ఇలాంటి అంశాలను పరిశీలించిన తర్వాత లాల్ సింగ్ చద్దా చిత్రం 16 కోట్ల నుంచి 18 కోట్ల నికర వసూళ్లను సాధించవచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. ఒకవేళ తగ్గితే.. 13 కోట్ల లోపు కలెక్షన్లు ఉండవచ్చని అంచనా వేశారు. అధికారిక వసూళ్లు కొద్ది గంటల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది.

    English summary
    Aamir Khan's Laal Singh Chaddha has released on August 11th. Here are day 1 estimated collections worldwide
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X