Laal Singh Chaddha day 2 collections..దారుణంగా బాక్సాఫీస్ రిపోర్టు .. అమీర్ ఖాన్‌కు భారీ దెబ్బ!

మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించి, నిర్మించిన లాల్ సింగ్ చద్దా చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నది. అమీర్ ఖాన్ కెరీర్‌లో ఎప్పడూ ఊహించిన ఫలితాన్ని చవిచూసే పరిస్థితి ఈ సినిమాకు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం రెండో రోజు బాక్సాఫీస్ పరిస్థితి ఇలా ఉంది..

 ప్రధాన నగరాల్లో నిరసనలు, ఆందోళనలు

ప్రధాన నగరాల్లో నిరసనలు, ఆందోళనలు

లాల్ సింగ్ చడ్డా చిత్రం అనేక వివాదాలు, ఆరోపణలతో ఆగస్టు 11 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా హిందువుల మనోభాలు దెబ్బ తీసిందనే ఉత్తరాదిలో భారీగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన నగరాల్లో థియేటర్ల వద్ద ఆందోళనలను నిర్వహిస్తున్నారు. దీంతో ప్రేక్షకులు థియేటర్లకు రాలేని పరిస్థితి ఉత్తరాదిలో ఉంది.

 అమీర్ ఖాన్‌పై కేసు నమోదు

అమీర్ ఖాన్‌పై కేసు నమోదు


ఇదిలా ఉండగా, లాల్ సింగ్ చడ్డా చిత్రం భారతీయ సైన్యాన్ని తప్పుడు రీతిలో చిత్రీకరించారనే ఆరోపణలతో అమీర్ ఖాన్‌పై ఢిల్లీ కోర్టులో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఢిల్లీకి చెందిన లాయర్ ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయి అని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 తొలి రోజు పేలవంగా కలెక్షన్లు

తొలి రోజు పేలవంగా కలెక్షన్లు


ఇలాంటి పరిస్థితుల ప్రభావంతో లాల్ సింగ్ చడ్డా చిత్రం తొలి రోజున 12 కోట్ల వసూళ్లతో పేలవమైన ప్రదర్శనను కొనసాగించింది. రెండో రోజున కూడా బాక్సాఫీస్ వద్ద అదే పరిస్థితి కనిపించింది. దేశవ్యాప్తంగా 45 శాతానికి పైగా కలెక్షన్లు క్షీణించాయి. తొలి రోజుతో పోల్చుకొంటే దారుణమైన వసూళ్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నది.

 రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్

రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్


దేశవ్యాప్తంగా లాల్ సింగ్ చడ్డా చిత్రం అడ్వాన్స్ బుకింగ్ డేటాను పరిశీలిస్తే.. తొలి రోజు హిందీ వెర్షన్‌కు 9027 టికెట్లు అమ్ముడైతే.. రెండో రోజున 8381 టికెట్లు అమ్ముడయ్యాయి. తొలి రోజున 2.84 కోట్లు వసూలైతే.. రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 1.63 కోట్లు నమోదయ్యాయి. అమీర్ ఖాన్ కెరీర్‌లో ఇదే లోయెస్ట్ అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

రెండో రోజు కలెక్షన్ల అంచనా

రెండో రోజు కలెక్షన్ల అంచనా


ఇక గురువారం లాల్ సింగ్ చడ్డా సాధించిన కలెక్షన్లలో దాదాపు 45 శాతం మేర కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. ఈ చిత్రం రెండో రోజున ఇండియాలో 7.5 కోట్ల మేర వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఈవారాంతానికి 50 కోట్ల మార్కును చేరుకొనే అవకాశం ఉంది. శని, ఆదివారాలతోపాటు ఆగస్టు 15 (సోమవారం కూడా) సెలవు దినం కావడం ఈ సినిమాకు కొంత ఊరట కలిగించే అంశంగా మారింది. ఈ మూడు రోజుల్లో కలెక్షన్లు పెరిగితే.. గౌరవప్రదమైన వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉంది.

 కీలకంగా ఆ మూడు రోజులు

కీలకంగా ఆ మూడు రోజులు


లాల్ సింగ్ చడ్డా సినిమా కలెక్షన్లపై ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేస్తూ.. చాలా పేలవంగా బాక్సాఫీస్ యాత్ర మొదలైంది. మల్టీప్లెక్స్‌లో ఫర్వాలేదనే కలెక్షన్లు, ఆక్యుపెన్సీ కనిపిస్తు్నది. మాస్ ఏరియాలో ఈ సినిమా బలహీనంగా కనిపిస్తున్నది. శని, ఆది, సోమవారాలు ఈ సినిమాకు అగ్ని పరీక్షగా మారే అవకాశం ఉంది అని ట్వీట్‌లో పేర్కొన్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X