Laal Singh Chaddha Day 1 collections: అమీర్ ఖాన్ కెరీర్ లోనే దారుణం.. RRR లో సగం కూడా రాలేదు!
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నుంచి చాలా రోజుల తర్వాత వచ్చిన చిత్రం లాల్ సింగ్ చడ్డా. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలి అని అమీర్ ఖాన్ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. తనకు ఎక్కువగా మార్కెట్ లేని సౌత్ ఇండస్ట్రీలో కూడా గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ చేయించాడు. అయితే సినిమా మాత్రం ఊహించని విధంగా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా మొదటిరోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే..

రీమేక్ సినిమాతో
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో ఏదో ఒక మంచి పాయింట్ ఉంటుంది అని ప్రేక్షకులకు బలమైన నమ్మకం అయితే ఉంది. ఇక ఆయన ఎంతో ఆలోచించి చేసిన చిత్రాలలో లాల్ సింగ్ చడ్డా సినిమా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును అందుకున్న ఫారెస్ట్ గంప్ సినిమాను రీమేక్ చేయడం అమీర్ వల్లే సాధ్యమవుతుంది అని చాలామంది సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు. విడుదలకు ముందే చాలామంది నటీనటులకు కూడా ఈ సినిమాను చూపించడం జరిగింది.

నెగిటివ్ కామెంట్స్
లాల్ సింగ్ చడ్డా సినిమాను చూసిన చాలామంది సినీ ప్రముఖులు ప్రశంసలతో అమీర్ ఖాన్ ని చాలా ఎక్కువగా పొగిడారు. అయితే తీరా వెండి తెరపై సినిమాను చూసిన తర్వాత ఆడియన్స్ అయితే అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది అని.. అనవసరంగా ఒక మంచి కంటెంట్ ఉన్న ఫారెస్ట్ గంప్ సినిమాను రీమేక్ చేసి పాడు చేశారు అంటూ పెదవి విరుస్తున్నారు.

బజ్ లేకపోవడంతో
అయితే లాల్ సింగ్ చడ్డా సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఎంత అందుకుంది అలాగే మొదటి రోజు ఈ సినిమాకు ఏ స్థాయిలో వస్తువులు రావచ్చు అనే విషయంలో కూడా ముందుగానే బాలీవుడ్ మీడియా అయితే ఒక ఒక అంచనాకు వచ్చింది. సినిమాకు పెద్దగా హైప్ లేకపోవడం వలన అడ్వాన్స్ బుకింగ్ కూడా చాలా తక్కువగానే వచ్చాయి. అమీర్ ఖాన్ ప్రమోషన్ స్ట్రాటజీ అయితే ఈ సినిమాకు పెద్దగా హెల్ప్ అవ్వలేదు.

తెలుగులో..
కేవలం హిందీలోనే కాకుండా మిగతా భాషల్లో కూడా అమీర్ ఖాన్ చాలా గ్రాండ్ గానే ఈ సినిమాను విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నాగార్జున ప్రత్యేకంగా ఈ సినిమాను ప్రమోట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకు మెగాస్టార్ సమర్పకుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇక లాల్ సింగ్ చడ్డా సినిమాలో నాగచైతన్య పాత్ర కూడా చాలా చిన్నది కావడం అది కూడా అంతగా ఇంపాక్ట్ చూపించలేదు. ఇక తెలుగు కలెక్షన్స్ అయితే థాంక్యూ సినిమా కంటే చాలా తక్కువ వచ్చినట్లు తెలుస్తోంది.

మొదటి రోజు దారుణంగా
ఇక ఫైనల్ గా మొదటి రోజు లాల్ సింగ్ చడ్డా సినిమా కేవలం 11 కోట్ల కలెక్షన్స్ మాత్రమే అందుకున్నట్లు సమాచారం. అసలయితే ఈ సినిమాకు మొదటి రోజు 15 కోట్ల వరకు రావచ్చు అని అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఊహించిన దాని కంటే తక్కువ రేంజ్ లో 11 కోట్ల కలెక్షన్స్ రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

RRR కంటే తక్కువగా..
ఒక విధంగా హిందీలో RRR, KGF 2 సినిమాల మొదటిరోజు కలెక్షన్స్ లో సగం కంటే తక్కువ రావడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. గత 13 ఏళ్ల కాలంలో అమీర్ ఖాన్ ఎలాంటి సినిమా చేసినా కూడా మినిమం 20 కోట్లకు పైగానే వసూలు అందుకుంటూ వచ్చాయి. కానీ అతని కెరీర్లో మొదటిసారి అతి తక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి అంటే బాలీవుడ్ పరిస్థితి ఎలా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి మిగిలిన హాలిడేస్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











