Laal Singh Chaddha Day 2 collections: రెండో రోజు మరింత డౌన్.. ఇది అసలు ఊహించి ఉండరు!

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు అమీర్ ఖాన్ సినిమా విడుదలవుతోంది అంటే ఆ హడావిడి మాములుగా ఉండేది కాదు. ఆయన చిన్న సినిమా చేసిన కూడా భారీ స్థాయిలో విడుదల అయ్యేది. అంతేకాకుండా అభిమానుల నుంచి కూడా రెస్పాన్స్ ఒక రేంజ్ లో ఉండేది. కానీ ఇటీవల కాలంలో మాత్రం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారిగా పెను మార్పులు చోటు చేసుకోవడంతో సినిమాలో ఎంతో బాగుంటే గాని జనాలు థియేటర్లకు రావడం లేదు. ఇక కనీసం అమీర్ ఖాన్ సినిమా అయినా సరే సక్సెస్ అవుతుంది అంటే అది కూడా జరగలేదు. లాల్ సింగ్ చడ్డా సినిమా రెండవ రోజు కూడా దారుణంగా కలెక్షన్స్ అందుకోవడంతో సినిమా పరిస్థితి ఏమిటో దాదాపు క్లియర్ గా అర్థమైపోయింది. ఇక ఈ సినిమా రెండవ రోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అని వివరాల్లోకి వెళితే..

దారుణమైన ఓపెనింగ్స్

దారుణమైన ఓపెనింగ్స్

అమీర్ ఖాన్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు మినిమం కలెక్షన్స్ అందుకునేవి. అసలైతే రెండు రోజుల్లోనే ఆయనపై పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేది. అంతలా అమీర్ తన కథలను సెలెక్ట్ చేసుకునేవారు. అంతేకాకుండా మేకింగ్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. అలాంటిది అమీర్ ఖాన్ కెరీర్ లోనే అతి దారుణమైన ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా లాల్ సింగ్ చద్దా నిలిచింది.

RRR, KGF 2 కంటే తక్కువే

RRR, KGF 2 కంటే తక్కువే

అమీర్ ఖాన్ మార్కెట్ ప్రకారమైతే గత 13 ఏళ్ల కాలంలో ఇంత దారుణమైన ఓపెనింగ్స్ అయితే ఎప్పుడు జరగలేదు. మొదటి రోజు మినిమం 20 కోట్లు వరకు కలెక్షన్స్ అందుకుంటూ వచ్చినా ఈ హీరో ఇప్పుడు లాల్ సింగ్ చడ్డా సినిమాతో మాత్రం ఒక టాలీవుడ్ పాన్ ఇండియా సినిమా రేంజ్ లో కూడా ఒక ఒపెనింగ్స్ అందుకోలేకపోయాడు. మొదటి రోజు బాలీవుడ్లో RRR, KGF 2 సినిమాల కంటే చాలా తక్కువ ఓపెనింగ్స్ రావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

మొదటి రోజు

మొదటి రోజు

అసలైతే మొదటి రెండు రోజుల్లో లాల్ సింగ్ చడ్డా సినిమాకు తప్పకుండా 50 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తాయని అనుకున్నారు. కానీ మొదటి రోజు ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ చాలా వరకు తగ్గిపోయాయి దీంతో కేవలం ఫస్ట్ డే అయితే సినిమాకు కేవలం 11 కోట్లు మాత్రమే వచ్చాయి. రక్షాబంధన్ హాలిడేస్ సీజన్ ఉన్నప్పటికీ కూడా సినిమా ఈ స్థాయిలో తక్కువ కలెక్షన్స్ అందుకుంటుంది అని కలలో కూడా ఎవరూ ఊహించుకోలేదు

 రెండవ రోజు డౌన్

రెండవ రోజు డౌన్

కనీసం రెండవ రోజు అయినా ఈ సినిమా నిలదొక్కుకుంటుంది అని అనుకున్నారు. కానీ మొదటి రోజు నెగటివ్ టాక్ రావడంతో అలాగే రివ్యూలు కూడా అంతగా పాజిటివ్గా లేకపోవడంతో లాల్ సింగ్ చడ్డా సినిమాకు కలెక్షన్స్ చాలా వరకు తగ్గిపోయాయి. ఇక రెండవ రోజు మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా 40% కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. రెండవ రోజు ఈ సినిమాకు టోటల్ కలెక్షన్స్ కేవలం 7 కోట్లు మాత్రమే వచ్చినట్లుగా తెలుస్తోంది.

రెండు రోజుల్లో మొత్తం

రెండు రోజుల్లో మొత్తం

ఇక రెండు రోజుల్లో మొత్తంగా ఈ సినిమా కేవలం 17 కోట్లు మాత్రమే అందుకుంది. సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేసినప్పటికీ ఏమాత్రం హెల్ప కాలేదు. హిందీలోనే కాకుండా తెలుగు తమిళ్ లో కూడా ఈ సినిమాను భారీగానే విడుదల చేసినప్పటికీ ఏమాత్రం లాభం లేకుండా పోయింది.

షోలు క్యాన్సిల్

షోలు క్యాన్సిల్

అయితే మొదటి రోజు లాల్ సింగ్ చడ్డా సినిమాను చూసేందుకు జనాలు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అయితే మార్నింగ్ షో తర్వాత ఈవినింగ్ షోలకు వచ్చేసరికి దాదాపు 1300 షోలు క్యాన్సిల్ చేసినట్లుగా మీడియాలో కథనాలు వెలుపడ్డాయి. థియేటర్లలో జనాలు సగం కూడా లేకపోవడంతో చాలావరకు షోలు క్యాన్సిల్ అయ్యాయి. ఏదేమైనా కూడా ఆమీర్ ఖాన్ ఫారెస్ట్ గంప్ సినిమాను అనవసరంగా రీమేక్ చేశాడు అనే విమర్శలు కూడా మూటగట్టుకుంటున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X