Laal Singh Chaddha Day 3 collections: పెరగని బాక్సాఫీస్ నెంబర్స్.. ఇలా అయితే కష్టమే?

ఆమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా ఇటీవల భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం చాలా ఎక్కువ సమయం తీసుకున్న ఆమీర్ ఖాన్ ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలి అని గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ కూడా చేశాడు. కేవలం హిందీలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ప్రత్యేకంగా ఇతర స్టార్ల సహాయం తీసుకుని మరి సినిమాను జనాలకు జనాల ముందుకు తీసుకువెళ్లాడు. అయితే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం తీవ్రంగా నిరాశపరిచిందే. ఈ సినిమాకు మూడవ రోజు కలెక్షన్స్ చాలా వరకు తగ్గిపోయాయి. ఇక మొత్తంగా ఇప్పటివరకు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసింది.. అనే వివరాల్లోకి వెళితే..

అత్యధిక మార్కెట్ ఉన్న హీరో

అత్యధిక మార్కెట్ ఉన్న హీరో

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఆమీర్ ఖాన్ ఇన్ని రోజులు ఇండియాలోనే అత్యధిక మార్కెట్ ఉన్న హీరోల్లో లిస్టులో కొనసాగుతూ వచ్చారు. అయితే ఈ స్టార్ డమ్ మొత్తం కూడా ఆయన లాల్ సింగ్ చడ్డా సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా అసలు ఈ స్థాయిలో డిజాస్టర్ అవుతుంది అని కూడా ఎవరు ఊహించలేదు

అంతకంటే తక్కువ

అంతకంటే తక్కువ

గడిచిన 13 ఏళ్ల కాలంలో చూసుకుంటే ఆమీర్ ఖాన్ తన ప్రతి సినిమాతో కూడా మినిమం బాక్స్ ఆఫీస్ వద్ద 20 నుంచి 25 కోట్ల వరకు ఓపెనింగ్స్ అందుకునేవాడు. ఫస్ట్ డే ఆ స్థాయిలో కలెక్షన్స్ ఉంటే ఇప్పుడు లాల్ సింగ్ చడ్డా సినిమాకు వచ్చేసరికి మాత్రం ఊహించిన విధంగా ఆ సంఖ్య పడిపోయింది. ఇప్పుడు కనీసం RRR, KGF2 సినిమాలు మొదటి రోజు హిందీలో అందుకున్న కలెక్షన్స్ కంటే తక్కువ ఉండడం విశేషం.

ఊహించని ఓపెనింగ్స్

ఊహించని ఓపెనింగ్స్

లాల్ సింగ్ చడ్డా సినిమా మొదటిరోజు 12 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత రెండవ రోజు పెద్దగా హైప్ లేకపోవడంతో సినిమా 9 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక మూడవ రోజు కూడా అంతకంటే తక్కువ కలెక్షన్స్ వచ్చాయని సమాచారం. నెగిటివ్ రివ్యూలు రావడంతో పాటు సినిమాలో కొన్ని అభ్యంతరమైన సన్నివేశాలు ఉన్నాయని ఓ వర్గం ప్రేక్షకుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

మూడవ రోజు ఎంతంటే?

మూడవ రోజు ఎంతంటే?

ఇక లాల్ సింగ్ చడ్డా సినిమా మూడో రోజు ఎంత కలెక్ట్ చేసింది అని వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా శనివారం రోజు ప్రపంచ వ్యాప్తంగా 8 నుంచి 9 కోట్ల మధ్యలో వసూళ్లను అందుకున్నట్లు సమాచారం. కానీ పెట్టిన పెట్టుబడికి ఈ తరహా కలెక్షన్స్ అనేవి ఏమాత్రం వర్కౌట్ కావు. లాల్ సింగ్ చడ్డా సినిమా హిందీలోనే కాకుండా తెలుగు తమిళంలో కూడా భారీగా విడుదలైన విషయం తెలిసిందే. ఇక తెలుగులో కూడా ఈ సినిమా అయితే పెద్దగా ప్రాఫిట్స్ అందుకునేలా అయితే కనిపించడం లేదు.

టోటల్ కలెక్షన్స్

టోటల్ కలెక్షన్స్

ఇక మొత్తంగా మూడు రోజుల్లో లాల్ సింగ్ చడ్డా సినిమా బాక్సాఫీస్ వద్ద 28 కోట్ల నుంచి 29 కోట్ల మధ్యలో నెట్ కలెక్షన్స్ అందుకున్నట్లు సమాచారం. అసలైతే ఆమిర్ ఖాన్ ఫ్లాప్ సినిమా థంగ్స్ ఆఫ్ హిందుస్థాన్ కూడా బాక్సాఫీస్ వద్దమో మొదటి వీకెండ్ లో 50 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంది. కానీ ఇప్పుడు లాల్ సింగ్ చడ్డా సినిమా ఆ స్థాయిలో అయితే ప్రభావం చూపలేదు. మరి సోమవారం రోజు అయినా ఈ సినిమా కొంత కలెక్షన్స్ పెంచుకుంటుందో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X