twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Laal Singh Chaddha Pre Release Bussiness: ఆమిర్ ఖాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్.. మొత్తం ఎంతంటే?

    |

    బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మినిమం పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకు వస్తూ ఉంటాయి. అందుకే ఆయనతో నిర్మాతలు సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు ఇక ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ అందుకున్న ఆమిర్ ఖాన్ ఇప్పుడు లాల్ సింగ్ చద్దా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఆగస్టు 11న రానున్న ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా ప్రాజెక్టుగా విడుదల చేయబోతుండగా మంచి బిజినెస్ అయితే చేసింది. ఇక మొత్తంగా ఈ సినిమా ఎంత బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే..

    ఎక్కువ గ్యాప్ ఇచ్చిన హీరో

    ఎక్కువ గ్యాప్ ఇచ్చిన హీరో

    ఆమిర్ ఖాన్ వెండితెరకు గ్యాప్ ఇచ్చి చాలా కాలం అయింది. ఆయన నటించిన చివరి సినిమా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. అసలు ఆమిర్ ఖాన్ అలాంటి సినిమా చేయడం ఏమిటి అనే కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. బాహుబలి పోటీగానే ఆ సినిమాను తీసి అనవసరంగా డబ్బులు పోగొట్టుకున్నారు అనే కామెంట్స్ కూడా వచ్చాయి కానీ ఈసారి ఆమిర్ ఖాన్ మంచి నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమాతో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకునెందుకు సిద్ధమయ్యాడు.

    ఊహించని రికార్డులు

    ఊహించని రికార్డులు

    మిగతా హీరోలు ఎక్కువగా యాక్షన్ సినిమాలతోనే బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటూ ఉంటారు. కానీ ఆమిర్ ఖాన్ మాత్రం వినూత్నమైన ఎమోషనల్ కంటెంట్ కథలతోనే రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంటారు. త్రీ ఇడియట్స్, పీకే అలాగే దంగల్ సినిమా కూడా మంచి ఎమోషనల్ కంటెంట్ తో వచ్చే అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకున్నాయి.

    భారీ స్థాయిలో విడుదల

    భారీ స్థాయిలో విడుదల

    ఇక ప్రస్తుతం అందరికి ఫోకస్ కూడా లాల్ సింగ్ చద్దా సినిమా పైనే ఉంది. ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమిగ్ గా తెరకెక్కిన ఈ సినిమా హిందీలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా భారీ స్థాయిలోనే విడుదల కాబోతోంది. ముఖ్యంగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సినిమాను ప్రత్యేకంగా గీత ఆర్ట్స్ ద్వారా విడుదల చేస్తున్నారు.

    నాన్ థియేట్రికల్ బిజినెస్

    నాన్ థియేట్రికల్ బిజినెస్

    ఇక లాల్ సింగ్ చద్దా సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే.. ముందుగా నాన్ థియేట్రికల్ గానే సినిమా భారీ స్థాయిలో బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. శాటిలైట్ హక్కులు అన్ని భాషల్లో కలుపుకొని మంచి అమౌంట్ వచ్చినట్లు టాక్. అలాగే ఓటీటీ మ్యూజిక్ హక్కుల రూపంలో సినిమా మొత్తంగా ఈ రూట్లో 200 నుమచి 250 కోట్లకు పైగానే బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.

     ఓవర్సీస్ బిజినెస్

    ఓవర్సీస్ బిజినెస్


    ఓవర్సీస్ లో మొత్తంగా లాల్ సింగ్ చద్దా సినిమా మంచి బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ట్రైలర్ ద్వారా సినిమాకు మంచి హైప్ అయితే క్రియేట్ అయ్యింది. దీంతో బయ్యర్లు సినిమాను కొనుగోలు చేసేందుకు ఎంతగానో పోటీ పడ్డారు. ఇక ఇతర దేశాల్లో మొత్తంగా సినిమా మరో 100 కోట్ల బిజినెస్ చేసినట్లు టాక్ అయితే వస్తోంది.

    మొత్తం బిజినెస్ ఎంతంటే?

    మొత్తం బిజినెస్ ఎంతంటే?

    లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్ కోసం ఆమిర్ ఖాన్ చాలానే తిరుగుతున్నాడు. తెలుగులో ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవితో ప్రమోట్ చేయించడం అలాగే మరికొంతమందికి ప్రత్యేకంగా షోను చూపించడం హాట్ టాపిక్ గా మారింది. ఇక చైనాలో కూడా సినిమాకు మంచి ప్రాఫిట్ దక్కే ఛాన్స్ ఉందట. ఇక మొత్తంగా చూసుకుంటే లాల్ సింగ్ చద్దా సినిమా 550 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద మొత్తంగా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

    English summary
    Laal Singh Chaddha movie world wide Pre Release Bussiness details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X