Laal Singh Chaddha vs Raksha Bandhan ఫస్ట్ డే కలెక్షన్స్.. అందరి ఫోకస్ వీరిపైనే.. ఎంత రావచ్చంటే?
కరోనా ప్రభావం తర్వాత చాలా వరకు బాలీవుడ్ సినిమాల పరిస్థితి దారుణంగా తయారయింది. పెద్ద స్టార్ హీరో సినిమాలకు కూడా జనాలు రావడానికి పెద్దగా ఇష్టపడడం లేదు. ఇక ఇప్పుడు అందరి ఫోకస్ కూడా అమీర్ ఖాన్ సినిమా పైనే ఉంది. పీకే సినిమా తర్వాత సరైన సక్సెస్ అందుకో లేకపోయినా ఆమీర్ ఖాన్ ఇప్పుడు ఎలాగైనా లాల్ సింగ్ చద్దా సినిమాతో సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఇక మరొకవైపు అక్షయ్ కుమార్ కూడా రక్షాబంధన్ సినిమాతో ట్రాక్ లోకి రావాలి అని చూస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు నేడు విడుదలవుతుండగా.. మొదటి రోజు ఎంత వసూళ్లను అందుకోవచ్చు అనే వివరాల్లోకి వెళితే..
Recommended Video


మారిపోయిన బాలీవుడ్ ప్రేక్షకులు
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక విధంగా ప్రేక్షకులు చాలా మారిపోయారు అని చెప్పవచ్చు. అక్కడ ఎంతో హైప్ క్రియేట్ చేస్తున్న సినిమాలు కూడా మొదటి రోజు దారుణమైన ఓపెనింగ్స్ అందుకుంటున్నాయి. ఇక ఫ్యాన్ ఇండియా సినిమాలకు కూడా జనాలు బాగా ఎక్కువగా అలవాటు పడిపోయినట్లు తెలుస్తోంది. బాహుబలి KGF RRR, పుష్ప సినిమాలు కూడా హిందీ జనాలకు బాగా నచ్చడంతో ఇప్పుడు రొటీన్ సినిమాలకు ఏమాత్రం రెస్పాన్స్ రావడం లేదు.

అందరి ఫోకస్ అమీర్ సినిమాపైనే..
ఇక చాలాకాలం తర్వాత అమీర్ ఖాన్ సినిమా రిలీజ్ అవుతూ ఉండడంతో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో అనేది ప్రస్తుతం ఇండియా మొత్తం ఎదురుచూస్తోంది. ఎందుకంటే కరోనా తర్వాత థియేటర్లో బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఎవరి సినిమా కూడా థియేటర్ లో రాలేదు. మొదటిసారి అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా భారీ స్థాయిలో విడుదలవుతోంది. దీంతో ఈ సినిమా ఫలితం ఇప్పుడు రాబోయే సినిమాలపై కూడా కొంత ఆధారపడుతుంది అని చెప్పవచ్చు.

మొదటి రోజు ఎంత రావచ్చు?
ముఖ్యంగా మొదటి రోజు అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సినిమా ఎలాంటి వసూళ్ళను అందుకుంటుంది అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో నాగచైతన్య కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమా మొదటి రోజు 13 నుంచి 15 కోట్ల మధ్యలో కలెక్షన్స్ అందుకోవచ్చు అని టాక్ అయితే వినిపిస్తోంది.

రక్షా బంధన్
మరోవైపు అక్షయ్ కుమార్ నటించిన రక్షాబంధన్ సినిమా కూడా నేడే వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు అయితే లేవు. ఫ్యామిలీ మూవీ కావడంతో పండుగ సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు అని నమ్మకంతో ఉన్నారు. కరెక్టుగా రక్షాబంధన్ సమయంలోనే సినిమా విడుదలవుతుండడం కూడా కొంత హైప్ అయితే క్రియేట్ చేసింది

అక్షయ్ సినిమాకు ఎంత రావచ్చంటే?
నిర్మాతలు అయితే ఈ సినిమా మీద నమ్మకంతో లాల్ సింగ్ చడ్డా సినిమాతో పోటీపడుతూ భారీ స్థాయిలోనే విడుదల చేశారు. ఇక మొదటి రోజు కొంత పాజిటివ్ టాక్ అందుకున్నప్పటికీ సినిమా పూర్తిస్థాయిలో అయితే హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దర్శనం ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇక మొదటి రోజు రక్షాబంధన్ సినిమా 10 నుంచి 12 కోట్ల మధ్యలో కలెక్షన్స్ రావచ్చు అని తెలుస్తోంది. మరి ఈ రెండు సినిమాలు ఈ వీకెండ్ సెలవుల దినాల్లో మొత్తంగా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











