చిన్న సినిమా సరికొత్త చరిత్ర.... 50 లక్షలతో తీస్తే 100 కోట్ల కలెక్షన్స్ దిశగా!

ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సంచలన విజయాలు సాధిస్తున్నాయి. వందల కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమాలు బొక్కబోర్లా పడుతుంటే కోటి, రెండు కోట్ల రూపాయలతో తీసిన సినిమాలు మాత్రం మోతమోగిస్తున్నాయి. ఈ ఏడాది టాలీవుడ్ టూ బాలీవుడ్ పలు చిన్న చిత్రాలు వసూళ్ల వర్షం కురిపించి భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. తాజాగా ఈ లిస్ట్‌లోకి చేరింది మరో చిన్న సినిమా. కేవలం 50 లక్షల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. 100 కోట్ల రూపాయలకు చేరువైంది. ఆ సినిమా ఏది? ఇప్పటి వరకు ఆ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

లాలో కృష్ణ సదా సహాయతే తారాగణం
గుజరాతీ భాషలో తెరకెక్కిన చిత్రం లాలో కృష్ణ సదా సహాయతే. అంకిత్ సాఖియా దర్శకత్వం వహించారు. మ్యానిఫెస్ట్ ఫిల్మ్స్, ఆర్‌డీ బ్రదర్స్ మూవీస్, సోల్ సూత్ర, నీమ్ ట్రీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మానసి పరేఖ్, పార్థివ్ గోహిల్, మ్యానిఫెస్ట్ ఫిల్మ్స్, జై వ్యాస్ ప్రొడక్షన్స్, అజయ్ బలవంత్ పదారియాలు ఈ చిత్రాన్ని నిర్మించారు. రీవా రచ్, సృహద్ గోస్వామి, కరణ్ జోషి, మిస్తీ కడేచా, అన్షు జోషి తదితరులు లాలో చిత్రం కీలకపాత్రలు పోషించారు. శుభం గజ్జార్ సినిమాటోగ్రఫి, కృశాంశ్ వాజా, అంకిత్ సాఖియాలు ఎడిటింగ్, సమ్మిత్ జైలే సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. అక్టోబర్ 10న లాలో కృష్ణ సదా సహాయతే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Laalo Krishna Sada Sahaayate Box Office Collections Gujarati film has come close to 100 crores mile stone

లాలో కృష్ణ సదా సహాయతే బడ్జెట్ ఎంత?
అందుబాటులో ఉన్న వనరులను వాడుకుంటూనే గుజరాత్, ముంబైలలోని పలు అందమైన లోకేషన్స్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరిగినట్లుగా చెబుతున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార ఖర్చులు కలిపి లాలో కృష్ణ సదా సహాయతే సినిమాకు 50 లక్షల రూపాయల బడ్జెట్ అయ్యింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకు తొలి వారం అంతగా ఆదరణ లభించలేదు. ఆ తర్వాత పాజిటివ్ రివ్యూలు, మౌత్‌టాక్‌తో ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తారు.

లాలో కృష్ణ సదా సహాయతే కలెక్షన్స్
తొలిరోజు కేవలం 2 లక్షల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న లాలో కృష్ణ సదా సహాయతే చిత్రం తొలివారం 33 లక్షల రూపాయలు, రెండో వారం 27 లక్షల రూపాయలు, మూడో వారంలో 62 లక్షల రూపాయలు, నాలుగో వారంలో ఏకంగా 12.08 కోట్ల రూపాయలు, ఐదో వారంలో 25.70 కోట్ల రూపాయలు, ఆరో వారంలో 24.40 కోట్ల రూపాయలు రాబట్టింది. 43వ రోజున 1.9 కోట్ల రూపాయలు, 44వ రోజున 3.4 కోట్ల రూపాయలు, 45వ రోజున 4.65 కోట్ల రూపాయలు చొప్పున ఇండియా వైడ్‌గా 73.35 కోట్ల రూపాయల నికర వసూళ్లు...86.60 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. మరో 13 కోట్ల రూపాయలు సాధిస్తే 100 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించడానికి రెడీ అయ్యింది లాలో కృష్ణ సదా సహాయతే చిత్రం.

100 కోట్ల క్లబ్‌కు చేరువగా
భారతీయ చిత్ర పరిశ్రమలో చిన్న ఇండస్ట్రీగా ఉన్న గుజరాతీ సినీరంగంలో ఇప్పటి వరకు 1998లో వచ్చిన దేశ్ రే జోయా దాదా పర్దేశ్ జోయా 15 కోట్ల రూపాయల కలెక్షన్స్‌తో సంచలనం సృష్టించింది. ఆ సినిమాయే ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన గుజరాతీ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు లాలో కృష్ణ సదా సహాయతే చిత్రం 27 ఏళ్ల రికార్డును బద్ధలు కొట్టడంతో పాటు 100 కోట్ల రూపాయలు సాధించిన తొలి గుజరాతీ చిత్రంగా నిలవనుంది. బాక్సాఫీస్ వద్ద ఇంతటి సంచలనం సృష్టించిన ఈ సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఇప్పటికే హిందీ డబ్బింగ్ వెర్షన్ పూర్తవ్వగా.. నవంబర్ 28న లాలో కృష్ణ సదా సహాయతే మూవీ దేశ ప్రజల ముందుకు రానుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X