Laggam Collections: లగ్గం బడ్జెట్ 8 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరిస్థితి ఏమిటంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినీ నిర్మాణ సంస్థ సుబిషి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో జరిగే పెళ్లి బ్యాక్ డ్రాప్ చిత్రం లగ్గం. యువ దర్శకుడు రమేష్ చెప్పాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, రోహిణి, సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, వడ్లమాని శ్రీనివాస్, రఘుబాబు, సప్తగిరి, చమ్మక్ చంద్ర, ప్రభాస్ శ్రీను, కృష్ణుడు, రచ్చ రవి, ప్రభావతి, చిత్రం శ్రీను తదితరులు నటించారు. టీ వేణుగోపాల్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 25వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో పెళ్లికి సంబంధించిన ఆచారాలు, సాంప్రదాయాలు కథాంశంగా రూపొందిన ఈ సినిమాను భారీ తారాగణంతో నిర్మించారు. అలాగే ఈ సినిమాకు కావాల్సిన వాతావరణం సృష్టించే విషయంలో ఎలాంటి రాజీ పడకుండా రిచ్‌గా రూపొందించారు.

laggam-movie-box-office-collections-worldwide

ఈ సినిమాలో నటించిన టాప్ నటీనటులు, మణిశర్మ లాంటి సాంకేతిక నిపుణులతో మరింత క్రేజ్ మారాయి. ఈ సినిమాలో ఆర్టిస్టుల రెమ్యునరేషన్, టెక్నిషియన్ల పారితోషికాలు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 8 కోట్ల రూపాయలతో నిర్మించారు.

లగ్గం సినిమా రిలీజ్‌కు ముందే ప్రీమియర్లు ప్రదర్శించడంతో మౌత్ టాక్ పెరిగి బజ్ క్రియేట్ అయింది. దాంతో ఈ సినిమాకు రెస్పక్టబుల్ ఆక్యుపెన్సీ కనిపించింది. ఈ సినిమాకు తెలంగాణలో మంచి స్పందన కనిపించింది. ఆంధ్రాలో ఫర్వాలేదనే విధంగా ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 40 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

ఇక ఈ సినిమా తొలి రోజు ట్రేడ్ వర్గాల అంచనాల కంటే మెరుగ్గానే వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా మొదటి రోజు 40 లక్షల రూపాయల నెట్, 80 లక్షల గ్రాస్ వసూళ్లు నమోదైనట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ఓవర్సీస్ కలెక్షన్ల సమాచారం అందాల్సి ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సుమారుగా 4 కోట్ల షేర్, 8 కోట్ల గ్రాస్‌గా అంచనా వేశారు.

More from Filmibeat

Read more about: laggam sai ronak box office
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X