Laila Closing Collections:లైలా క్లోజింగ్ కలెక్షన్లు.. విశ్వక్ మూవీకి ఎన్ని కోట్ల నష్టమంటే?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, ఆక్షాంక్ష శర్మ, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించిన చిత్రం లైలా. ఉమెన్ గెటప్‌లో విశ్వక్ నటించిన ఈ చిత్రం అనేక వివాదాల మధ్య ఫిబ్రవరి 14వ తేదీన వాలైంటైన్స్ డే కానుకగా గ్రాండ్‌‌గా రిలీజైంది. బట్టల రామస్వామి బయోపిక్ ఫేమ్ రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్ పరంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే రిలీజ్ తర్వాత డిజాస్టర్ టాక్‌తో ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్‌కు భారీగా రప్పించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన లైలా చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్‌తో రిలీజైంది. ఈ సినిమాను సుమారుగా 20 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ భారీగా చేశారు. నటీనటుల పారితోషికాలు, ప్రమోషన్స్ ఖర్చులతో కలిపి ఈ మూవీ బడ్జెట్ మొత్తంగా 22 కోట్ల రూపాయల మేర అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Laila Box Office Closing Collections Worldwide Vishwak Sen s movie hit or Flop

లైలా చిత్రం ప్రమోషన్స్‌కు మంచి బజ్ క్రియేట్ కావడంతో ఈ సినిమాకు మంచి బిజినెస్ కూడా జరిగినట్టు ప్రచారం జరిగింది. ఈ మూవీ ఆంధ్రా, నైజాం థియేట్రికల్ రైట్స్‌ సుమారుగా 6.5 కోట్లుగా వాల్యూ కట్టారు. అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ బిజినెస్‌ను 2.5 కోట్ల రూపాయలుగా వాల్యూ చేశారు. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 9 కోట్లు మేర జరిగిందని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది.

లైలా సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 1.5 కోట్లు, రెండో రోజు 50 లక్షలు, 3వ రోజు 60 లక్షలు, 4వ రోజు 40 లక్షలు, 5వ రోజు 30 లక్షలు, 6వ రోజ 25 లక్షలు, 7వ రోజు 20 లక్షలు వసూలు చేసింది. వారం రోజుల్లో ఈ సినిమా థియేట్రికల్ రన్‌ ముగించుకొని కేవలం బాక్సాఫీస్ వద్ద 3.75 కోట్ల రూపాయలను నికరంగా.. 4.3 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Laila Box Office Closing Collections Worldwide Vishwak Sen s movie hit or Flop

ఇక ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమాకు డిజాస్టర్‌గానే బాక్సాఫీస్ జర్నీని ముగించింది. విశ్వక్ సేన్ గత సినిమాలతో పోల్చుకొంటే ఈ మూవీ దారుణమైన ఫలితాన్ని చవి చూసింది. ఈ చిత్రం కేవలం 50 లక్షల రూపాయలు మాత్రమే కలెక్ట్ చేసింది. దాంతో భారీగా ఈ సినిమా నష్టాల్లో ముగిసింది. ఈ సినిమా సుమారుగా 9 కోట్ల మేర నష్టాలతో ముగిసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

లైలా సినిమా షైన్ స్క్రీన్ బ్యానర్‌కు థియేట్రికల్‌గా భారీ నష్టాలకు గురి చేసింది. అయితే కొంతలో కొంత ఓటీటీ బిజినెస్ పాజిటివ్‌గా జరగడం ఉపశమనంగా మారింది. ఈ సినిమాతో ఊహించని నష్టాలను పొందాల్సి వచ్చిందని బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లు వెల్లడించారు.

More from Filmibeat

Read more about: laila vishwak sen
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X