Laila Collections: షాకింగ్‌గా లైలా బాక్సాఫీస్ కలెక్షన్లు.. విశ్వక్ మూవీకి ఎంత నష్టమంటే?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, ఆక్షాంక్ష శర్మ, కామాక్షి భాస్కర్ల కీలక పాత్రల్లో నటించిన చిత్రం లైలా. ఉమెన్ గెటప్‌లో విశ్వక్ నటించిన ఈ చిత్రం అనేక వివాదాల మధ్య ఫిబ్రవరి 14వ తేదీన వాలైంటైన్స్ డే కానుకగా గ్రాండ్‌గా రిలీజైంది. బట్టల రామస్వామి బయోపిక్ ఫేమ్ రామ్ నారాయణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రమోషన్స్ పరంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే రిలీజ్ తర్వాత డిజాస్టర్ టాక్‌తో ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్‌కు భారీగా రప్పించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన లైలా చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్‌తో రిలీజైంది. ఈ సినిమాను సుమారుగా 20 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ భారీగా చేశారు. నటీనటుల పారితోషికాలు, ప్రమోషన్స్ ఖర్చులతో కలిపి ఈ మూవీ బడ్జెట్ మొత్తంగా 22 కోట్ల రూపాయల మేర అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

లైలా చిత్రం ప్రమోషన్స్‌కు మంచి బజ్ క్రియేట్ కావడం, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో 30 ఇయర్స్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ బాయ్‌కాట్‌కు పిలుపు నివ్వడం ఈ సినిమాకు పాజిటివ్‌గా మారాయి. దాంతో ఈ సినిమాకు మంచి బిజినెస్ కూడా జరిగినట్టు ప్రచారం జరిగింది. ఈ మూవీ ఆంధ్రా, నైజాం థియేట్రికల్ రైట్స్ సుమారుగా 6.5 కోట్లుగా వాల్యూ కట్టారు. అలాగే కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ బిజినెస్‌ను 2.5 కోట్ల రూపాయలుగా వాల్యూ చేశారు. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 9 కోట్లు మేర జరిగిందని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది.
బాయ్ కాట్ కాంట్రవర్సీతో లైలా అందర్నీ ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది. కానీ కంటెంట్ చాలా వీక్‌గా ఉండటంతో మూవీ అంతగా మెప్పించలేకపోయింది. దాంతో బాక్సాఫీస్ వద్ద పేలవమైన కలెక్షన్లు నమోదు అవుతున్నాయి. ఈ సినిమా వసూళ్లు నిరాశపరుస్తున్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా? అనే అంశం ఆసక్తికరంగా మారింది.
లైలా సినిమా మూడు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 1.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 60 లక్షలు, మూడో రోజు 60 లక్షల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 2.7 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 50 లక్షల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 3.2 కోట్ల రూపాయలు నికరంగా వసూలు చేసింది.

ఇక లైలా మూవీ 4వరోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ కనిపించడం లేదు. దాంతో ఆక్యుపెన్సీ తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది. ధాంతో ఈ సినిమా 4వ రోజు 40 లక్షల నికరంగా, 80 లక్షలు గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం చాలా కష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











