Laila Business: లైలా బిజినెస్. విశ్వక్ సేన్ మూవీకి.. ఎన్ని కోట్లు వస్తే లాభాల్లోకి వస్తుందంటే?
తెలుగులో సినీ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై యువ నిర్మాత సాహు గారపాటి నిర్మించిన చిత్రం లైలా. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ జంటగా, కామాక్షి భాస్కర్ల, వెన్నెల కిషోర్, హర్షవర్ధన్, బ్రహ్మాజీ, బబ్లూ పృథ్వీ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..
లైలా చిత్రం ఫుల్ ఎంటర్‌టైనర్, యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన సినిమాను ఖర్చుకు వెనుకాడకుండా భారీగా నిర్మించారు. భారీ తారాగణం, టాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేశారు. దాంతో ఈ సినిమాకు భారీగా ఖర్చు జరిగింది. ఈ మూవీని సుమారుగా 35 కోట్ల రూపాయలతో ఉన్నత ప్రమాణాలతో నిర్మించినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

లైలా టైటిల్ అనౌన్స్‌మెంట్, టీజర్, ట్రైలర్ లాంటి కంటెంట్, అలాగే వివాదాస్పద అంశాలు ఈ సినిమాకు సానుకూలంగా మారాయి. ఈ సినిమాపై ఓ రేంజ్ క్రేజ్, బజ్ ఏర్పడింది. దాంతో ఈ చిత్రానికి బిజినెస్ కూడా అంతే మొత్తంలో క్రేజ్‌తో జరిగింది. ఈ సినిమాకు డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని విశ్వక్ సేన్ కెరీర్‌లో ది బెస్ట్ అనే విధంగా ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు.
విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ రావడంతో లైలా మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌కు మంచి డిమాండ్ కనిపించింది. అయితే ఆంధ్రా, నైజాం సెంటర్ల రైట్స్ సుమారుగా 6 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 7 కోట్ల షేర్, 14 కోట్ల గ్రాస్ దాదాపు రాబట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా 2.5 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ సినిమా టోటల్ బిజినెస్ సుమారుగా 8.5 కోట్ల రూపాయలు మేర జరిగినట్టు ట్రేడ్ రిపోర్ట్. ఈ సినిమా మొత్తంగా 10 కోట్ట రూపాయల షేర్ రాబడితే.. లాభాల్లోకి వస్తుందని అంచనా వేశారు. ఈ సినిమా మొత్తంగా బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల షేర్... 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











