స్టాలిన్: ఫస్ట్‌వీక్ 15 కోట్లు
మెగాస్టార్ చిరంజీవి తాజా సంచలనం స్టాలిన్ తొలివారంలో 15 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చిరంజీవి నుంచి సగటు ప్రేక్షకుడు ఆశించే మాస్ ఎలిమెంట్లు పాళ్లు తగ్గినా.. కథాకథనం, ముఖ్యంగా ఆఖరి అరగంట క్లయిమాక్స్ బాగుండటంతో ప్రేక్షకులు తృప్తిగా బయటకు వస్తున్నారని చెబుతున్నారు. ఈ చిత్రానికి కలెక్షన్లు ఇలాగే కొనసాగితే తొలివారంలో 15 కోట్ల రూపాయలు వసూలు చేయగలదని అంటున్నారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ థియేటర్లలో స్టాలిన్ రిలీజ్ రోజు (సెప్టెంబర్ 20) నాటికి 15 వేల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్‌లో విక్రయించినట్టు భోగట్టా. చిరంజీవి అభిమానుల తాకిడిని, ఇటు చిత్రపరిశ్రమ ఒత్తిడిని తట్టుకోడానికి ప్రసాద్స్ యాజమాన్యం ఒకే రోజు 15 ప్రదర్శనలు వేసినట్టు తెలుస్తోంది. తొలి రెండు వారాలు టికెట్లు రేట్లు పెంచుకునే సౌలభ్యం ఉండటంతో ప్రస్తుతం ప్రసాద్స్‌లో టికెట్ రేటు 150 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











