Lakshmi Narasimha Closing Collections: లక్ష్మీ నరసింహ క్లోజింగ్ కలెక్షన్లు.. బాలకృష్ణ కెరీర్‌లోనే దారుణంగా..
నట సింహం నందమూరి బాలకృష్ణ, అందాల భామ ఆసిన్ జంటగా నటించిన చిత్రం లక్ష్మీ నరసింహ. శ్రీ సాయి గణేష్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ జయంత్ సీ పరాంజీ దర్శకత్వం వహించారు. 2004 సంవత్సరం జనవరి 14వ తేదీన రిలీజైన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే తెలుగు సినిమా పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుండటంతో ఈ మూవీని తాజాగా జూన్ 8వ తేదీన రిలీజ్ చేశారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? అప్పట్లో ఎంత వసూలు చేసింది. రీ రిలీజ్ ద్వారా ఎంత వసూలు చేసింది? అనే వివరాల్లోకి వెళితే...
లక్ష్మీ నరసింహ సినిమా విషయానికి వస్తే.. తమిళంలో హరి దర్శకత్వంలో విక్రమ్ నటించిన సామీ సినిమాకు రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమాకు జయంత్ సీ పరాంజీ స్క్రీన్ ప్లే అందిస్తే.. పరుచూరి బ్రదర్స్ మాటలను తూటల్లా పేల్చారు. మణిశర్మ అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఈ సినిమాలో భారీగా తారాగణం నటించారు. ప్రకాశ్ రాజ్, కే విశ్వనాథ్, రావు రమేష్, మురళీ మోహన్, సునీల్, రక్షిత (ఐెటమ్ సాంగ్) తదితరులు నటించారు.

లక్ష్మీ నరసింహ సినిమాకు టాప్ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ పనిచేయడంతో అప్పట్లో 10 కోట్ల రూపాయలతో ఈ సినిమాను రూపొందించగా.. ఈ చిత్రం 16 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. అంటే అప్పట్లో 30 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందని అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాలోని డైలాగ్స్, పాటలకు మంచి క్రేజ్ ఉండటంతో ఈ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.
అయితే లేటెస్ట్ టెక్నాలజీతో 4K క్వాలిటీతో సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో లక్ష్మీ నరసింహ సినిమా పాత ప్రింట్లను డిజిటల్‌లోకి కన్వర్ట్ చేసి మంచి సైండ్, అలాగే విజువల్ క్వాలిటీతో సినిమాను భారీగా ఖర్చుతో రిచ్ ఫార్మాట్‌లో మార్చారు. ఈ సినిమా 4K కన్వర్షన్ కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించి ఈ సినిమాను అందంగా ముస్తాబు చేశారు. అదనంగా ఓ పాటను కూడా చేర్చడం విశేషంగా మారింది.
ఇలా భారీ అంచనాలతో రీ రిలీజ అయిన లక్ష్మీ నరసింహ చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రదర్శనను కొనసాగించింది. బాలకృష్ణ బర్త్ డే వేడుకలను పురస్కరించుకొని రిలీజ్ చేసిన ఈ సినిమా ఫ్యాన్స్ కూడా ఆదరించలేకపోయారనేది తాజా కలెక్షన్లు స్పష్టం చేశాయి. తొలి రోజు ఇండియా వైడ్‌గా ఈ సినిమా 4 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్ మార్కెట్‌లో 3 వేల డాలర్లకుపైగా అంటే.. సుమారుగా 3 లక్షల రూపాయలు వసూలు చేసింది. తొలి రోజు మొత్తంగా 7 లక్షల రాబట్టింది.
ఇక ఈ సినిమా పూర్తిస్థాయిలో థియేట్రికల్ రన్ కొనసాగించలేకపోయింది. ప్రేక్షకులకు లేకపోవడం వల్ల చాలా చోట్ల షోలు క్యాన్సిల్ చేశారు. దాంతో అంతంత మాత్రమే వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా సుమారుగా 10 లక్షల రూపాయలు మేర వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా రీ రిలీజ్ కోసం చేసిన ఖర్చు కూడా పూర్తిగా రాలేదనే విషయాన్ని సినీ వర్గాలు చెప్పుకొంటున్నాయి.


Click it and Unblock the Notifications











