Lakshmi Narasimha Collections: గ్రాండ్‌గా లక్ష్మీనరసింహ రీ రిలీజ్.. బాలయ్య మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు ఎంతంటే?
నట సింహం నందమూరి బాలకృష్ణ, అందాల భామ ఆసిన్ జంటగా నటించిన చిత్రం లక్ష్మీ నరసింహ. శ్రీ సాయి గణేష్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖ డైరెక్టర్ జయంత్ సీ పరాంజీ దర్శకత్వం వహించారు. 2004 సంవత్సరం జనవరి 14వ తేదీన రిలీజైన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అయితే తెలుగు సినిమా పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుండటంతో ఈ మూవీని తాజాగా జూన్ 8వ తేదీన రిలీజ్ చేశారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? అప్పట్లో ఎంత వసూలు చేసింది. రీ రిలీజ్ ద్వారా ఎంత వసూలు చేసింది? అనే వివరాల్లోకి వెళితే...
లక్ష్మీ నరసింహ సినిమా విషయానికి వస్తే.. తమిళంలో హరి దర్శకత్వంలో విక్రమ్ నటించిన సామీ సినిమాకు రీమేక్‌గా రూపొందింది. ఈ సినిమాకు జయంత్ సీ పరాంజీ స్క్రీన్ ప్లే అందిస్తే.. పరుచూరి బ్రదర్స్ మాటలను తూటల్లా పేల్చారు. మణిశర్మ అందించిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. మార్తాండ్ కే వెంకటేశ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

ఈ సినిమాలో భారీగా తారాగణం నటించారు. ప్రకాశ్ రాజ్, కే విశ్వనాథ్, రావు రమేష్, మురళీ మోహన్, సునీల్, రక్షిత (ఐెటమ్ సాంగ్) తదితరులు నటించారు. ఈ సినిమాకు టాప్ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ పనిచేయడంతో అప్పట్లో 10 కోట్ల రూపాయలతో ఈ సినిమాను రూపొందించగా.. ఈ చిత్రం 16 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. అంటే అప్పట్లో 30 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిందని చెప్పుకోవచ్చు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తాజాగా తెలుగు సినిమా రంగంలో రీ రిలీజ్ సినిమా విడుదలై రికార్డు వసూళ్లు రాబడుతుండటంతో మరోసారి బెల్లంకొండ సురేష్ ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఈ సినిమాలో ఓ కొత్త పాటను కూడా చేర్చారు. చంద్రబోస్ రాయగా భీమ్స్ స్వరాలు సమకూర్చారు. ఇలా కొత్త ప్యాకేజ్‌తో సినిమాను తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
అయితే లక్ష్మీ నరసింహ రీ రిలీజ్ అనుకొన్నంత బజ్ క్రియేట్ చేయలేకపోయింది. ఈ సినిమా ప్రమోషన్స్ పెద్దగా లేకపోవడం వల్ల థియేటర్లలో రిలీజైన విషయమే ప్రేక్షకులకు తెలియలేకపోయింది. ఈ సినిమా తొలి రోజు సుమారుగా 4 లక్షల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా బాక్సాఫీస్ అప్ డేట్స్ గురించి ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి..


Click it and Unblock the Notifications











