twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బయోపిక్‌ను చిత్తు చేస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్.. ప్రపంచవ్యాప్తంగా రికార్డుల జోరు!

    |

    ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద జోరును కొనసాగిస్తున్నది. సినీ విమర్శకుల అంచనాలను మంచి ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతుండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను రిలీజ్ చేయకుండా స్టే విధించడంతో ఈ చిత్రానికి అనూహ్యమైన క్రేజ్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధిస్తున్నది. గత రెండు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే..

    రెండు రోజుల కలెక్షన్లు ఇవే

    రెండు రోజుల కలెక్షన్లు ఇవే

    మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన లక్ష్మీస్ ఎన్టీఆర్ కేవలం రెండు రోజుల్లోనే రూ.5 కోట్లు వసూలు చేసింది. తెలంగాణలో సుమారు రూ.4 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.1 కోటి వసూలు చేయడం గమనార్హం. ఏపీని మినహాయించి ఈ చిత్రం రికార్డుస్థాయి వసూళ్లను రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

    ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో

    ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో

    తెలుగు సినిమాలకు ఆర్థిక రాజధానిగా పేరొందిన హైదరాబాద్ క్రాస్ రోడ్స్‌లో లక్ష్మీస్ ఎన్టీఆర్ భారీ కలెక్షన్లను రాబడుతున్నది. ఈ చిత్రం బాలకృష్ణ రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్‌ను మించి వసూళ్లను రాబట్టింది. తొలిరోజు ఎన్టీఆర్ మహానాయకుడు రూ.1,60,641, కథానాయకుడు రూ.6,28,937వసూలు చేయగా, లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రూ. 6,42,016 రాబట్టింది.

    లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ అండ్ రేటింగ్లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ అండ్ రేటింగ్

    యూఎస్‌లో వసూళ్ల ధమాకా

    యూఎస్‌లో వసూళ్ల ధమాకా

    లక్ష్మీస్ ఎన్టీఆర్ ఓవర్సీస్ మార్కెట్‌లో అత్యుత్తమ వసూళ్లను నమోదు చేసుకొన్నది. గత రెండు రోజుల్లో అమెరికాలో ఈ చిత్రం 2 లక్షలకుపైగా వసూళ్లను నమోదు చేసింది. అంటే ఈ చిత్రం సుమారు రూ.1.40 కోట్లు వసూలు చేసినట్టు తెలిసింది. ఆదివారం కూడా సెలవు దినం కావడంతో మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశం లేకపోలేదు.

    ఐఎండీబీలో కూడా రికార్డు

    ఐఎండీబీలో కూడా రికార్డు

    సినిమా రేటింగ్‌ను నిర్ధారించే ఐఎమ్‌డీబీలో కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ రికార్డు క్రియేట్ చేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి ఐఎమ్‌డీబీ 7.9 రేటింగ్ ఇస్తే, ఎన్టీఆర్: కథానాయకుడుకి 5.9, మహానాయకుడు 5.5 రేటింగ్ ఇవ్వడం గమనార్హం. ఈ క్రమంలో బాలకృష్ణ రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్‌పై లక్ష్మీస్ ఎన్టీఆర్ పైచేయి సాధించింది.

    English summary
    'Lakshmi's NTR' might have easily earned approximately Rs 5 Cr on second day at the box office. Official figures are yet to be known. In the meantime, check out the tweets about 'Lakshmi's NTR' second-day collections. Ram Gopal Varma sensational comments on NTR's family. He said, fans are the main reason for NTR charisma and felt unhappy stoping this movie, not to release in Andhra Pradesh. Even YS Jagan also balsted on stalling Lakshmis NTR in AP
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X