Lal Salaam Box Office Report రజనీ అడ్వాన్స్ బుకింగ్ రచ్చ.. లాల్ సలామ్‌ కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన చిత్రం లాల్ సలామ్. విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్, కపిల్ దేవ్ నటించిన ఈ చిత్రానికి రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్ రూపొందించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సుభాస్కరన్ నిర్మించారు. అయితే భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? అడ్వాన్స్ బుకింగ్ రిపోర్టు ఏమిటనే విషయాల్లోకి వెళితే..

క్రికెట్, గ్రామ రాజకీయాలు, మాఫియా బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన లాల్ సలామ్ సినిమాను భారీ తారాగాణంతో తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ 90 కోట్లుగా అంచనా వేశారు. ఇటీవల వచ్చిన రజనీకాంత్ సినిమాల్లో ఈ చిత్రం అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన చిత్రాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Lal Salaam Day 1 Prediction of Box Office Collections Worldwide

ఇక లాల్ సలామ్ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా రిలీజ్‌కు ముందు సెన్సార్ అధికారులు ప్రశంసలు గుప్పించారని తెలిసింది. ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా నిడివి 2 గంటల 32 నిమిషాలుగా నిర్ణయించారు.

లాల్ సలామ్ సినిమా ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్‌ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంతో భారీగా అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. ఈ సినిమా తమిళనాడులోనే తొలి రోజు కోసం 2 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది. దాంతో తొలి రోజు భారీ కలెక్షన్లు సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్న లాల్ సలామ్ సినిమాకు ఓ మాదిరి అడ్వాన్స్ బుకింగ్, రెస్సాన్స్ నమోదైంది. గతంలో వచ్చిన రజనీ సినిమాల కంటే తక్కువగానే అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు వచ్చాయి. దాంతో ఈ సినిమా తొలి రోజు 10 కోట్ల నెట్, 20 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.

Lal Salaam Day 1 Prediction of Box Office Collections Worldwide

ఓవర్సీస్‌లో కూడా లాల్ సలామ్ భారీగా రిలీజ్ అవుతున్నది. అమెరికా, కెనడాలో కలిపి ఈ మూవీ 300 లొకేషన్లలో రిలీజ్ చేస్తున్నారు. 400 షోలు ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సినిమా ఇప్పటి వరకు 30 వేల డాలర్లు అమెరికాలో వసూలు చేసింది. సింగపూర్‌లో 18k, యూకేలో భారీగా కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల నెట్, 25 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X