Lal Salaam 3 days Collections పేలవంగా లాల్ సలామ్ కలెక్షన్లు.. రజనీకాంత్ కెరీర్‌లోనే దారుణంగా!
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం లాల్ సలామ్. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ కీలక పాత్రలను పోషించారు. ఏఆర్ రెహ్మన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా తొలి వారాంతంలో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
లాల్ సలామ్ మూవీని సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ విషయానికి వస్తే.. 35 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా 1200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అలా ఈ మూవీ 37 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది.

జైలర్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత లాల్ సలామ్ రావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా రజనీకాంత్ స్థాయి సినిమాగా లేకపోవడం, అంచనాలకు దిగువన ఉండటంతో ఈ మూవీపై ప్రేక్షకులు, సినీ విమర్శకులు పెదవి విరిచారు. దాంతో ఈ సినిమా భారీగా ఓపెనింగ్స్ కూడా సాధించలేకపోయింది.
లాల్ సలామ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలవంగా ఓపెనింగ్స్ సాధించింది. ఈ చిత్రం తొలి రోజున తమిళంలో 3.25 కోట్లు నికరంగా, తెలుగులో 30 లక్షల రూపాయలతో 3.55 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండో రోజు ఈ మూవీ తమిళంలో 3 కోట్ల రూపాయలు, తెలుగులో 25 లక్షల రూపాయల నికర కలెక్షన్లు రాబట్టింది. దాంతో రెండు రోజుల్లో 6.80 లక్షల రూపాయలు నికరంగా ఇండియాలో సాధించింది.

రజనీకాంత్ స్టామినాకు తగినట్టుగా లాల్ సలామ్ చిత్రం కలెక్షన్లు పుంజుకోలేకోయాయి. కానీ స్టడీగా మాత్రం వారాంతం వరకు వసూళ్లు నమోదయ్యాయి. ఈ సినిమా ఆక్యుపెన్సీ సుమారుగా 38 శాతం నమోదైంది. చెన్నై, కోయంబత్తూరు, పాండిచ్చేరి నగరాల్లో కొంత సానుకూలత కనిపించింది. తెలుగులో పరిస్థితి మరింత దారుణంగా కనిపించింది.
లాల్ సలామ్ సినిమా 3వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళంలో 3 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. తెలుగులో 28 లక్షలు మాత్రమే రాబట్టింది. దాంతో ఈ సినిమా సుమారుగా 3.2 కోట్ల రూపాయలు నమోదు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో మూడు రోజుల్లో 11 కోట్ల మేర కలెక్షన్లు సాధించింది. ఓవర్సీస్‌లో 4 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. దాంతో ఈ చిత్రం మూడు రోజుల్లో 15 కోట్ల రూపాయలు రాబట్టింది.


Click it and Unblock the Notifications











