Lal Salaam Day 1 Collections దారుణంగా లాల్ సలామ్ కలెక్షన్లు.. రజనీకాంత్ బాక్సాఫీస్ స్టామినా ఇదేనా?

జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం లాల్ సలామ్. హిందూ, ముస్లిం ఐక్యత, క్రికెట్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమాకు రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్వకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. ఫిబ్రవరి 9వ తేదీన రిలీజైన ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, వరల్డ్ వైడ్‌గా వసూలు చేస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

లాల్ సలామ్ చిత్రాన్ని పక్కాగా రూరల్ నేటివిటితో పక్కాగా రూపొందించారు. ఈ సినిమాను ఖర్చుకు వెనుకాడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. రజనీకాంత్‌కు 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ చెల్లించినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఇతర నటీనటులు, ఏఆర్ రెహ్మాన్ లాంటి సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు కలిపితే ఈ సినిమాను 80 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్ భారీ బజ్ క్రియేట్ చేశాయి.

 Lal Salaam Movie Day 1 Box Office Collections worldwide

జైలర్ లాంటి హిట్ తర్వాత వచ్చిన లాల్ సలామ్ చిత్రం తమిళనాడులో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా తమిళనాడులో 1600 షోలు ప్రదర్శించడం ద్వారా 3 కోట్ల రూపాయల కలెక్షన్లు నమోదు చేశాయి. తెలుగులో పెద్దగా ఈ సినిమా కలెక్షన్లు సాధించలేకపోయింది. ఈ చిత్రం ఆంధ్రా, నైజాంలో 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఇక లాల్ సలామ్ సినిమా తొలి రోజు ఓవర్సీస్‌ కలెక్షన్లు అంతంతా మాత్రంగానే నమోదు అయ్యాయి. ఈ సినిమా 2 కోట్ల నికరంగా, 4 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇటీవల వచ్చిన జైలర్ సినిమాతో పోల్చితే అత్యంత దారుణంగా కలెక్షన్లు నమోదు అయ్యాయి.

 Lal Salaam Movie Day 1 Box Office Collections worldwide

లాల్ సలామ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 3.5 కోట్ల రూపాయలు నికరంగా, 7 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా 5.5 కోట్లు నికరంగా 8 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా 50 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X