Lal Salaam Collections రజనీకాంత్ మూవీకి షాకింగ్ కలెక్షన్లు.. లాల్ సలామ్‌కు ఎన్ని కోట్ల వసూళ్లంటే?
జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం లాల్ సలామ్. హిందూ, ముస్లిం ఐక్యత, క్రికెట్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమాకు రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్వకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించారు. ఫిబ్రవరి 9వ తేదీన రిలీజైన ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, వరల్డ్ వైడ్‌గా వసూలు చేస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
రూరల్ నేటివిటితో పక్కాగా రూపొందిన లాల్ సలామ్ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. రజనీకాంత్‌కు 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ చెల్లించినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఇతర నటీనటులు, ఏఆర్ రెహ్మాన్ లాంటి సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు కలిపితే ఈ సినిమాను 80 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్ భారీ బజ్ క్రియేట్ చేశాయి.

జైలర్ సినిమా తర్వాత రజనీకాంత్ నటించిన మూవీ కావడంతో లాల్ సలామ్ సినిమాకు భారీగానే బిజినెస్ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 35 కోట్ల రూపాలయ థియేట్రికల్ బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమాకు ఉన్న డిమాండ్‌కు తగినట్టే సుమారుగా 1200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
లాల్ సలామ్ సినిమాకు తమిళనాడు మంచి స్పందన లభిస్తుండగా, తెలుగులో అంతంత మాత్రంగానే రెస్సాన్స్ బాక్సాఫీస్ వద్ద కనిపించింది. తమిళంలో తొలి రోజు 35 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది. ఇక తెలుగులో 30 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. కన్నడ, మలయాళంలో కూడా అదే పరిస్థితి కనిపించింది. అడ్వాన్స్ బుకింగ్ రూపంలో 4.25 కోట్లు రాబట్టింది.

లాల్ సలామ్ ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి వస్తే.. యూఎస్, కెనడాలో 40K డాలర్లు, యూకే ఐర్లాండ్‌లో 7K పౌండ్స్, ఆస్ట్రేలియాలో 20 వేల డాలర్లు, న్యూజిలాండ్‌లో 2 వేల డాలర్లు, యూఏఈ, గల్ఫ్ దేశాల్లో 18 వేల డాలర్లు, మలేషియాలో 110K RM, సింగపూర్‌లో 23K డాలర్లు, శ్రీలంకలో 1.2 మిలియన్ డాలర్్లు, యూరప్‌లో 15K డాలర్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 4.7 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది.
లాల్ సలామ్ సినిమా తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. తమిళనాడులో 6 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. తెలుగులో 2 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 70 కోట్ల రూపాయల గ్రాస్, 35 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











