For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Lal Singh Chaddha: నష్టాల్లో డిస్ట్రిబ్యూటర్స్.. ఆమిర్ ఖాన్ పరిహారం చెల్లించడా..?

  |

  బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా గత మూడేళ్లకు ముందు వరకు కూడా మంచి డిమాండ్ ఏర్పరచుకున్న అమీర్ ఖాన్ ఇప్పుడు లాల్ సింగ్ చడ్డా సినిమాతో మాత్రం ఊహించని విధంగా మొదటి భారీ విజయాన్ని చూడాల్సి వచ్చింది. ఈ తరహాలో గత 13 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా ఆమీర్ ఇంత అతి తక్కువ స్థాయిలో ఒపెనింగ్స్ అందుకుంది లేదు. ఇక లాల్ సింగ్ సినిమా మొత్తంగా ఏ స్థాయిలో నష్టాలను మిగులుస్తుంది అనేది ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా అమీర్ ఖాన్ నష్టపరిహారం కూడా చెల్లించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ విషయంపై.. వయాకామ్ 18 సీఈవో అజిత్ అంధారే ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

  అతి తక్కువగా

  అతి తక్కువగా

  బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఒకప్పుడు ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద మినిమం కలెక్షన్స్ అందుకునేవి. ముఖ్యంగా ఆయన ఫ్లాప్ సినిమాలు కూడా 20 కోట్లకు పైగానే ఓపెనింగ్స్ అందుకునేవి.. అంటే ఆమీర్ ఖాన్ రేంజ్ ఏ రేంజ్ లో ఉండేదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే లాల్ సింగ్ చడ్డా సినిమాకు వచ్చేసరికి ఆ స్టార్ డం మొత్తం ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. కనీసం 15 కోట్ల ఓపెనింగ్స్ కూడా అందుకోలేకపోయింది.

   షోలు క్యాన్సిల్

  షోలు క్యాన్సిల్

  ఇక రోజు రోజుకు లాల్ సింగ్ చడ్డా సినిమా కలెక్షన్స్ చాలావరకు తగ్గిపోతున్నాయి. చిత్ర యూనిట్ అంతకుముందే భారీ స్థాయిలో ప్రమోషన్ చేసినప్పటికీ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ముఖ్యంగా విడుదలైన మొదటి రోజే దాదాపు 1300 షోలు క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే జనాలు థియేటర్లోకి పెద్దగా రావడం లేదు అని.. అనవసరంగా థియేటర్లకు కరెంటు బిల్లులు కట్టడం వృధా ప్రయాస అని డిస్ట్రిబ్యూటర్ లు సినిమాను తీసివేసినట్లుగా కూడా టాక్ వచ్చింది.

   నెగిటివ్ ప్రచారం

  నెగిటివ్ ప్రచారం

  మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఈ తరహా పరాజయాన్ని చూస్తాడు అని ఎవరు కూడా కలలో కూడా అనుకోలేదు. అయితే ఈ సినిమా ఈ స్థాయిలో తక్కువ కలెక్షన్స్ అందుకోవడానికి ఒక విధంగా సినిమా కంటెంట్ లోపం అయినప్పటికీ మరొకవైపు ఆమీర్ ఖాన్ గతంలో చేసిన వ్యాఖ్యలకు గాను బాయ్ కాట్ ఎఫెక్ట్ కూడా గట్టిగానే చూపించింది. గతంలో దేశంలో రక్షణ లేదు.. ఇక్కడ ఉండాలని లేదు.. అని అమీర్ ఖాన్ చేసిన కామెంట్స్ కు ఓ వర్గం నెటిజన్లు ఈ సినిమాను చూడకూడదు అని బాయ్ కాట్ చేస్తున్నాము అన్నట్లుగా స్పందించడంతో నెగిటివ్ ప్రచారం ఎక్కువైంది.

  భారీ నష్టాల దిశగా..

  భారీ నష్టాల దిశగా..


  ఇక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా నష్టపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దాదాపు 180 కోట్ల భారీ బడ్జెట్ తో అమీర్ ఖాన్ తో పాటు వయాకామ్ 18 సంస్థ కూడా సంయుక్తంగా నిర్మించడం జరిగింది. అయితే ఇప్పటివరకు కనీసం 50 కోట్ల షేర్ కూడా కలెక్ట్ చేయలేకపోయిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీ స్థాయిలోనే నష్టాలు మిగిలిచే అవకాశం ఉన్నట్లుగా కూడా టాక్కొచ్చింది.

   అండగా ఆమిర్ ఖాన్

  అండగా ఆమిర్ ఖాన్

  అయితే డిస్ట్రిబ్యూషన్ లో భారీ స్థాయిలో నష్టపోవడం వలన కథానాయకుడు ఆమీర్ ఖాన్ చాలావరకు తీవ్రంగా నష్టపోయిన వారికి ఎంతో కొంత అండగా నిలిచేందుకు కొంత డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చినట్లు కూడా టాక్ అయితే వచ్చింది. కానీ అందులో పెద్దగా నిజం లేదు అని ఏకంగా ఆయన సహా నిర్మాత బయటకు చెప్పడంతో ఈ వార్త మరింత వైరల్ గా మారింది.

  క్లారిటీ ఇచ్చిన నిర్మాత

  క్లారిటీ ఇచ్చిన నిర్మాత

  వయాకామ్ 18 యొక్క CEO, అజిత్ అంధారే, ఒక ఇంటర్వ్యూలో నష్టాలకు పరిహారం గురించి అన్ని రూమర్స్ ను కొట్టిపారేశారు. " ఈ సినిమాకు బయట డిస్ట్రిబ్యూషన్ ఇవ్వలేదు అని.. V 18 స్టూడియోస్ ద్వారా పంపిణీ చేయబడుతోంది అని అంటూ ఏ సినిమాకు ఎలాంటి నష్టం జరగలేదు అని అన్నారు. అలాగే భారతదేశంలో & అంతర్జాతీయంగా ఇప్పటికీ సినిమా థియేటర్లలో ఫుల్ రన్ అవుతోందని నమ్మకంతో చెప్పడం విశేషం.

  English summary
  Lal Singh Chaddha losses and aamir khan to compensate distributors
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X