ఆ మూడు చిత్రాలు ప్లాఫులే (ట్రేడ్ టాక్)
క్రిందటి వారం మూడు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించటానికి ముందుకొచ్చాయి. వాటిల్లో శ్రీకాంత్, విమలా రామన్ జంటగా నటించిన 'రంగ ది దొంగ", ఆర్.పి.పట్నాయక్ 'బ్రోకర్", డబ్బింగ్ చిత్రం 'నేటి చరిత్ర" ఉన్నాయి. రిలీజ్ కు ముందు అంతకాదు ఇంత అంటూ క్రేజ్ తీసుకొద్దామని వీర ప్రయత్నం చేసిన శ్రీకాంత్ 'రంగ ది దొంగ" ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
రవితేజ విక్రమార్కుడు ఫార్మెట్ లో చేసిన ఈ చిత్రంలో శ్రీకాంత్ దొంగగా, ప్యాక్షనిస్ట్ గా ద్విపాత్రాభినయం చేసారు. అలాగే రమ్యకృష్ణ కూడా తన కెరీర్ లో బెస్ట్ గా నిలిచిన నీలాంబరి తరహా పాత్రను మరోసారి పోషించారు. ఇక విలన్ గా పేరు తెచ్చుకున్న జీవి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దర్శకత్వంలోనూ విషయం లేక, కథ ఆకట్టుకోక జనాల్ని రీచ్ కాలేకపోయిందీ చిత్రం.
ఇక ఆర్.పి పట్నాయక్ తను నటిస్తూ, దర్శకత్వం, సంగీతం అందిస్తూ అవినీతి ప్రాధానాంశంగా తీసిన 'బ్రోకర్" డాక్యుమెంటరీ నేరేషన్ తో బోర్ గా సాగింది. క్లైమాక్స్ బాగున్నా స్లో నేరేషన్ తో నడవటం, వినోదం మిస్సవటం ఈ చిత్రానికి మైనస్ లుగా నిలిచి మహా నసగా మారాయి. ఆ తర్వాత డబ్బింగ్ చిత్రమైన 'నేటి చరిత్ర" మినిమం ఓపినింగ్స్ తెచ్చుకోలేకపోయింది. సొంత కోడలుతోనే అక్రమ సంభంధం పెట్టుకున్న ఓ మామ కథతో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలోనూ అంతంత మాత్రమై తెలుగులో డిజాస్టర్ గా మారింది. మృగం చిత్రం తీసిన సామి దర్శకత్వంలో రూపొందింన ఈ చిత్రం ఓ సి గ్రేడ్ వ్యవహారంగా ముగిసింది.


Click it and Unblock the Notifications











